టోక్యో ఒలింపిక్స్ కాంస్యం గెలుచుకున్న పివి సింధు.. చరిత్ర సృష్టించింది..!

టోక్యో ఒలింపిక్స్ లో నిన్న సెమీ ఫైనల్స్ లో ఓడిన పివీ సింధు నేడు చైనా ప్లేయర్ హి బింగ్జియావోతో జరిగిన ఆటలో ప్రత్యర్ధిని చిత్తు చేసి కాంస్య పతకం గెలుచుకుంది.భారత స్టార్ షట్లర్ టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ విభాగంలో మరో పతకాన్ని తీసుకొచ్చింది పీవీ సింధు.

 Tokyo Olympics Pv Sindhu Won Bronze Record Created-TeluguStop.com

బింగ్జియావోతో జరిగిన మ్యాచ్ లో ఏమాత్రం తడబాటు లేకుడా వరుస రౌండ్లను గెలిచింది.తొలి రౌండ్ 21-13తో సొంతం చేసుకున్న సింధు రెండో రౌడ్ 21-15తో గెలిచింది.

రెండు వరుస రౌండ్లు గెలిచి టోక్యో ఒలిపిక్స్ లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడేలా చేసింది.ఒలింపిక్స్ లో పివీ సింధుకి ఇది రెండో పతకం.2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో కూడా సింధు రజత అందుకుంది.

 Tokyo Olympics Pv Sindhu Won Bronze Record Created-టోక్యో ఒలింపిక్స్ కాంస్యం గెలుచుకున్న పివి సింధు.. చరిత్ర సృష్టించింది..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

శనివారం జరిగిన మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ సెమీ ఫైనల్స్ లో సింధు చైనీస్ తైపేకి చెందిన వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ తై జు యింగ్ చేతులో ఓడిపోయింది.

అయితే నిన్న సెమీ ఫైనల్స్ ఓడినా సరే కాంస్యం కోసం పోరాడి గెలిచింది పివీ సింధు.వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను రజతం తర్వాత భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్య పతకం తీసుకొచ్చింది.

టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్యం గెలవగానే ప్రధాని మోడీ, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు ఆమెని ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు.వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలను సాధించిన క్రీడాకారిణిగా భారత తరపున చరిత్ర సృష్టించింది పివీ సింధు.

#TokyoOlym #Tokyo Olym #PV Sindhu #PV Sindhu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు