టోక్యో ఒలంపిక్స్: ఆశలు రేపి నిరాశపరిచిన హాకీ టీమ్..!

ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ఒలింపిక్స్ క్రీడలు.చాలా మంది వీటిలో పతకాలు సాధించాలని ఎంతో శ్రమిస్తుంటారు.

 Tokyo Olympics Hopeful Hockey Team Disappointed-TeluguStop.com

ఇందులో ఏ పతకమైన సాధిస్తే చాలు ఇక వారు అద్భుతమైన జీవితాన్ని పొందినట్టే అవుతుంది.ప్రపంచ దేశాలన్నీ ఈ ఒలంపిక్స్ గేమ్స్ కోసం బరిలోకి దిగుతుంటాయి.

తమ దేశంలో క్రీడాకారులు ఎవరైనా ఒలంపిక్స్ లో పతకం సాధిస్తే ఇక దేశం మొత్తం వారికి బంపరాఫర్లు ప్రకటిస్తారు.అలాంటి ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు ఈసారి ఎంతో కష్టపడింది.

 Tokyo Olympics Hopeful Hockey Team Disappointed-టోక్యో ఒలంపిక్స్: ఆశలు రేపి నిరాశపరిచిన హాకీ టీమ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కొంత దూరంలో ఆగిపోయి పరాభవం పాలైంది.

సెమీఫైనల్‌ మ్యాచ్‎ లో భారత్ హాకీ టీమ్ విజయాన్ని అందుకోలేదు.

ఒలింపిక్స్ లో భారత్ పురుషుల హాకీ జట్టు సెమీస్ కు చేరడంతో ఈ సారి పతకం ఖాయమని అందరూ అనుకున్నారు.అయితే ఇదే సమయంలో సెమీస్ లో భారత్ వరల్డ్ నెంబర్ వన్ బెల్జియం హాకీ టీమ్ తో పోటీ పడింది.

ఎంతో ఉత్కంఠతో సాగిన ఈ మ్యాచ్‎ లో 5-2 తేడాతో బెల్జియం గెలుపొందింది.

Telugu Hockey Team, Medals, Summer Olympics, Tokyo Olympics 2020, తokyo Olympics 2021-Latest News - Telugu

బెల్జియం చేతిలో ఇండియా ఓటమి పాలైంది.తొలి క్వార్టర్‌లోనే టీమిండియా రెండు గోల్స్‌ చేసింది.ఆ తర్వాత ఆటలో అంతగా రాణించలేదు.

దీంతో నాలుగో క్వార్టర్‎ లో బెల్జియం హాకీ జట్టు రెచ్చిపోయింది.వరుసగా మూడు గోల్స్ చేసి భారత్ కు చెమటలు పట్టించింది.

ఆఖరికి 5-2 తేడాతో మ్యాచ్‌ లో విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో విజయం పొందడంతో బెల్జియం హాకీ జట్టు ఫైనల్‎కు చేరింది.ఈసారి కూడా భారత్ పసిడి పతకాన్ని కోల్పోయింది.ఇకపోతే కాంస్య పతకం కోసం రెండో సెమీస్‌ లో ఓడినటువంటి జట్టుతో గురువారం రోజు భారత హాకీ జట్టు తలపడనుంది.

ఈసారి హాకీ జట్టుకు పతకం ఖాయమన్నట్టుగానే అనిపిస్తోంది.క్యాంస్యంతో భారత పురుషుల హాకీ జట్టు చిరిత్ర లిఖించనున్నట్లు తెలుస్తోంది.ఆట తీరు మెరుగు పరచుకుని కాంస్యం కోసం జట్టు బరిలోకి దిగడానికి సన్నద్దమవుతోంది.

#Hockey Team #Tokyo Olym #Medals #Olym #Okyo Olym

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు