ముగిసిన టోక్యో ఒలింపిక్స్.. అగ్రస్థానంలో అమెరికా..!

టోక్యొలో జూలై 23 నుండి ప్రారంభమైన ఒలింపిక్స్ నేటితో ముగిశాయి.జపాన్ రాజధాని టోక్యోలో కొద్దిసేపటి క్రితం ఒలింపిక్స్ ముగింపు ఉత్సవాలు నిర్వహించారు.

 Tokyo Olympics Completed Grand Event , America, China, India, Tokyo Olympics, To-TeluguStop.com

కరోనా టైం కాబట్టి ఎప్పటిలా కాకుండా ముగింపు వేడుకలు కూడా సింపుల్ గా చేశారు.ముగింపు వేడుకల్లో భారత బృందం ఫ్లాగ్ బేరర్ గా రెజ్లర్ భజరంగ్ పునియా వ్యవహరించడం జరిగింది.

భజరంగ్ పునియా 65 కిలోల ఫ్రీ స్టయిల్ రెజ్లింగ్ లో ఇండియాకు కాంస్య పతకాన్ని అందించాడు. టోక్యో ఒలింపిక్స్ చాలా కట్టుదిట్టమైన బయో బబుల్ నిబంధనల మధ్య సాగాయి.సక్సెస్ ఫుల్ గా క్రీడలను నిర్వహించినందుకు ఒలింపిక్స్ నిర్వాహకులను ప్రశంసిస్తున్నారు.2024లో పారిస్ లో ఒలింపిక్స్ జరుగనున్నాయి.

ఇక జరిగిన ఒలింపిక్స్ లో పతకాల పట్టికలో అమెరికా నెంబర్ 1 గా నిలిచింది.అమెరికా, చైనా ల మధ్య గట్టి పోటీ ఏర్పడింది.టోక్యో ఒలింపిక్స్ లో అమెరికా 39 స్వర్ణాలు, 41 రజతాలు, 33 కాంస్య పతకాలతో మొత్తం 113 పతకాలను సాధించింది.చైనా 38 బంగారు పతకాలు, 32 రజతాలు, 18 కాంస్యాలతో మొత్తం 88 పతకాలను తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచింద్ది.

ఆతిధ్య జపాన్ 27 స్వర్ణాలతో 3వ స్థానంలో నిలవగా బ్రిటన్, రష్యా టాప్ లో నిలిచాయి.పతకాల పట్టికలో 48వ స్థానంలో నిలిచింది భారత్.1 స్వర్ణం, 2 రజతాలు, 4 కాంస్యాలతో భారత్ 7 పతకాలు సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube