టోక్యో ఒలింపిక్స్.. స్వర్ణం గెలిస్తే 6 కోట్లు.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటన..!

జపాన్ రాజధాని టోక్యోలో జరుగనున్న ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులకు ఉత్సాహం నింపేలా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రోత్సాహకాలు ప్రకటించారు.ఒలింపిక్స్ లో పాల్గొనే ఒడిశా అథ్లెట్లు బంగారు పథకం సాధించిన వారికి 6 కోట్లు.

 Tokyo Olympics 2021 Odisha Cm Naveen Patnaik Announced Prize Money, 2021, Announ-TeluguStop.com

రజతం సాధిస్తే 4 కోట్లు.కాంస్య పతకం తెస్తే అలాంటి వారికి 2.5 కోట్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.అంతేకాదు టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొననున్న క్రీడాకారులందరికి 15 లక్షల చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించారు సీఎం నవీన్ పట్నాయక్.

విశ్వ క్రీడలకు సన్నద్ధం అయ్యేందుకు ఈ నగదు ఉపయోగపడేలా ఇస్తున్నట్టు చెప్పారు.

ఒలింపిక్స్ లో ఎంపికైన క్రీడారుల సమావేశం లో పాల్గొన్న ఆయన ఒలింపిక్స్ వెళ్లాలన్నది ప్రతి క్రీడాకారుడి కల అని.పతక గెలవడం తో ఆ కల సాకారం అవుతుందని అన్నారు.ఒడిశా నుండి ఒలింపిక్స్ కు వెళ్తున్న ద్యుతి చంద్, దీప్ గ్రేస్ ఎక్కా, నమిత టొప్పో, ప్రమోద్ భగత్, వీరేంద్ర లక్రా, అమిత్ రోహిదా లకు సీఎం అభినందనలు తెలిపారు.

Telugu Announced, Dyuthi Chand, Gold Medal, Mk Stalin, Namitha, Naveen Patnaik,

ఇక భారత్ నుండి టోక్యో ఒలింపిక్స్ కు 120 కి పైగా అథ్లెట్లు వెళ్తున్నట్టు సమాచారం.ఇప్పటికే ఒలింపిక్స్ లో పతకాలను గెలిస్తే బహుమతులు అందిస్తామని తమిళనాడ్ సీఎం ఎం.కే స్టాలిన్ కూడా ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube