జనసేనలో టోకెన్ల వ్యవహారం బట్టబయలు...!!!

ఎన్నికల్లో ధన ప్రవాహం ఏరులై పారుతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఎక్కడ ఎన్నికలు జరిగినా అదే తంతు.

 Token System In Janasena-TeluguStop.com

కానీ అబ్బే మేము ఎన్నికల నియమావళి ప్రకారమే ఖర్చు చేశాము అని చెప్పుకుంటారు తప్పుడు లెక్కలు చూపిస్తారు.కానీ కొన్ని కొన్ని పార్టీలు మాత్రం తాము ఎంతో నీతి, నిజాయితీగా ఉంటామని పై పై కి చెప్పుకున్నా తెరవెనుక చేసే పనులు మాత్రం చెకచెకా చేసేస్తారు.

అలాంటి పరిస్థితే ఇప్పుడు ఏపీలో ఎదురయ్యింది.తాము క్లీన్ అండ్ నీట్ గా నిజాయితీగా రాజకీయాలు చేస్తామని చెప్పిన జనసేన పార్టీపై అభియోగాలు మొదలయ్యాయి.

కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలో తాము ఏమి తక్కువ కాదు అనేలా జనసేన అభ్యర్ధులు కూడా దూసుకుపోతున్నారట.

అయితే గతంలోనే జనసేన పార్టీ అభ్యర్ధులు భారీగా ఖర్చులు చేస్తున్నారనే విషయం ఇంతకు ముందే బయటపడింది.

ధర్మవరం, గుంతకల్లు , అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నారని గతంలో కొన్ని కధనాలు వచ్చాయి.వీటిని నిజం చేస్తూ జనసేన ఓటుకు నోటు విషయంలో వీరు తమ సత్తా చూపిస్తున్నారట.అందులో భాగంగా

చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో జనసేనకు సంబంధించిన భారీ డంప్ ఒకటి బయటపడిందట.జనసేన అభ్యర్థికి ఓటు వేసేందుకు అనుగుణంగా ఓటర్లకు చేరవేయడానికి సంబంధించిన టోకెన్లు బయటపడ్డాయి.

వీటి విలువ కోటి రూపాయలకు పైనే అంటున్నారు.ముందుగా ఆ టోకెన్లు జనాలని పంపిణి చేసి వాటిని తీసుకు వెళ్లి ఒక సెంటర్ లో ఇస్తే అక్కడ వారికి రెండు వేల రూపాయలు ఇచ్చీలా ప్రణాళిక సిద్దం చేశారట.

ఇందుకు సంభందించి టోకెన్లు రవాణా చేస్తూ పన్నెండు మంది పట్టుబడినట్టుగా తెలుస్తోంది.మరి పట్టుబడిన టోకెన్ల విలువే కోటి రూపాయలు గా ఉంటే.

ఇప్పటి వరకూ ఈ రవాణా ఏ రేంజ్లో జరిగి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు.ఆదర్శాలు అంటూ వల్లే వేసే జనసేన పార్టీ ఇలా తమ ఆదర్శాలని తొక్కి పెట్టి అందరిలో మేము ఒకరిమే అనేట్టుగా వ్యవహరించడంతో అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube