నేడు పవన్‌ అటో... ఇటో తేలిపోనుంది

గత రెండు నెలలుగా ఉపిరి బిగపట్టి ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.దేశ వ్యాప్తంగా విమర్శలు, వివాదాలు, కొట్లాటల మద్య పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యాయి.

 Today Will Decide Pawan Kalyan Belongs To Either Movies Or Politics-TeluguStop.com

పార్లమెంటు ఎన్నికల కంటే తెలుగు రాష్ట్రాల జనాల్లో ఏపీ ఫలితాలపై ఎక్కువ ఆసక్తి ఉంది.చంద్రబాబు సీఎంగా కొనసాగుతాడా, జగన్‌ సీఎం అవుతాడా లేదంటే పవన్‌కు ఏమైనా ప్రజలు ఛాన్స్‌ ఇచ్చారా అనే విషయాలు గత కొన్ని రోజులుగా జనాలను తొలుస్తున్న ప్రశ్నలు.

-Political

ఇతర నాయకుల విషయం పక్కన పెడితే ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌ దారిపై పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి.పవన్‌ సినిమాలకు గుడ్‌ బై చెప్పిన విషయం తెల్సిందే.అజ్ఞాతవాసి తర్వాత పవన్‌ సినిమాలు చేయను అంటూ ప్రకటించాడు.అయితే నేడు వెలువడబోతున్న ఫలితాల్లో పవన్‌ జనసేన పార్టీ ఆశించిన స్థాయిలో ప్రతిభ కనబర్చకపోతే పరిస్థితి ఏంటీ అనే విషయమై చర్చించిన నేపథ్యంలో పవన్‌ మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

-Political

పవన్‌ రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేశాడు.ఆ రెండు చోట్లలో కనీసం ఒక్క చోట అయినా గెలుస్తాడనే నమ్మకం అందరిలో ఉంది.కనుక పవన్‌ అసెంబ్లీకి వెళ్లడం వంద శాతం ఖాయం అంటూ ఫ్యాన్స్‌ నమ్మకంగా ఉన్నారు.ఇక జనసేన తరపున పవన్‌ తప్ప మరెవ్వరు గెలవకుండా ఉంటే పరిస్థితి ఏంటీ అనే విషయమై కూడా చర్చ జరుగుతోంది.

ఒక వేళ పవన్‌ సింగిల్‌ ఎమ్మెల్యేగా జనసేన పార్టీ తరపున గెలిస్తే మాత్రం ఆయన రాజకీయాల్లో ఎక్కువ పని ఉండే అవకాశం లేదు.దాంతో పవన్‌ పార్ట్‌ టైం సినిమాలు చేసే అవకాశం ఉంది.

నేడు ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఆర్థిక అవసరాల కోసం అయినా చిరంజీవి ఖచ్చితంగా సినిమాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube