నేడు 9వ విడత పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధుల మంజూరు.. ఇలా చెక్‌ చేసుకోండి!

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా రైతులకు ఆర్థిక చేయూతనందిస్తోంది.ఈ పథకం 9వ విడతలో భాగంగా ఈరోజు (సోమవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12:30 గంటలకు రైతుల ఖాతాలక బదిలీ చేయనున్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ కూడా పాల్గొననున్నారు.వీడియో సమావేశంలో ప్రధాని కిసాన్‌ డబ్బులను విడుదల చేయనున్నారు.ఈ పథకం ద్వారా రైతుల ఖాతాలో రూ.19,500 కోట్లకు పైగా దాదాపు 9.75 కోట్ల రైతు కుటుంబాలు లబ్ధి పొందనున్నారు.అంతేకాదు ఈరోజు జరనున్న సమావేశంలో ప్రధాని మోడీ రైతులతో కూడా సంభాషించనున్నారు.

 Today Pm Kissan 9 Th Instalment To Be Released By Modi , Farmers , Farmer Benifi-TeluguStop.com

దాంతోపాటు దేశాన్ని ఉద్దేశించి కూడా ప్రసంగించనున్నారని ప్రధాన మంత్రి కార్యాలయ అధికారిక ప్రకటించింది.ఈ పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద పీఎం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాది రూ.6 వేలను.3 వాయిదాల్లో, రెండు హెక్టార్ల భూస్వాములు లేదా యజమాన్యం కలిగిన రైతులకు అందించనున్నారు.అర్హులైన లబ్ధిదారులకు నేరుగా బ్యాంకులోనే ఈ పథకం డబ్బులు జమ చేస్తోంది.

పీఎం కిసాన్‌ వాయిదాను ఆన్‌లైన్‌లో చెక్‌ చేసే విధానం

– కేంద్ర ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in హోం పేజీలో ఫార్మార్స్‌ కార్నర్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.అందులో ‘బెనిఫిషియరీ స్టేటస్‌’ను ఎంపిక చేసుకోవాలి.అందులో దరఖాస్తుదారుల స్థితిని తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.ఇందులో లబ్ధిదారుడి ఆధార్‌ నంబర్‌ లేదా ఖాతా నంబర్‌ లేదా మొబైల్‌ నంబర్‌ను నమోదు చేయాలి.అప్పుడు వెంటనే గెట్‌ డేటాపై క్లిక్‌ చేస్తే సరిపోతుంది.

Telugu Farmers, Pmkisan-Latest News - Telugu

పీఎం కిసాన్‌ లబ్ధిదారుల జాబితాను చెక్‌ చేసుకునే విధానం

వెబ్‌సైట్‌ హోం పేజీలోని ‘ఫార్మర్స్‌ కార్నర్‌’ను ఎంపిక చేసుకుని లబ్ధిదారుల జాబితాపై క్లిక్‌ చేయాలి.అందులో మీ రాష్ట్రం, జిల్లా, సబ్‌ డిస్ట్రిక్, బ్లాక్, గ్రామం ఎంచుకోవాలి.ఆ తర్వాత ట్యాప్‌ రిపోర్ట్‌’పై క్లిక్‌ చేయాలి.

ఈ పథకానికి ఎవరు అర్హులు?

Telugu Farmers, Pmkisan-Latest News - Telugu

తమ పేరిట సాగు చేస్తున్న భూస్వాములందరి కుటుంబాలు ఈ పథకం పొందడానికి అర్హులు.

కావాల్సిన ధ్రువ పత్రాలు

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కోసం దరఖాస్తు చేసుకునే రైతులు తమ వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, ఆధార్‌ కార్డు, అప్‌డేట్‌ చేసిన బ్యాంక్‌ ఖాతా, అడ్రస్‌ ప్రూఫ్, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటోను కలిగి ఉండాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube