ఇకపై భారత్ లో ఆపిల్ ఆన్లైన్ స్టోర్ షురూ…!  

today onwords apple online services available in india apple store, India, customers, products, Online , Bluedart - Telugu Apple Store, Bluedart, Customers, India, Online, Products

ప్రస్తుత కాలంలో భారతదేశంలో కూడా చాలామంది ఆపిల్ మొబైల్స్, ఆపిల్ కంపెనీకి చెందిన అనేక ప్రొడక్ట్స్ ను వినియోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది.అయితే ఇప్పటి వరకు భారతదేశంలో ఆపిల్ సంస్థకు చెందిన ఆన్లైన్ స్టోర్ రాలేదు.

TeluguStop.com - Today Onwords Apple Online Service Available In India

ఇప్పటివరకు ఆపిల్ సంస్థ భారతదేశంలో ఉన్న ఈ కార్ట్ సంస్థలతో కలిసి వారి ప్రొడక్ట్స్ ను అమ్ముతూ వచ్చింది.ఇక ఇప్పుడు నేరుగా ఆపిల్ సంస్థ తమ వెబ్సైట్ ద్వారా అమ్మకాలను మొదలుపెట్టింది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే…

TeluguStop.com - ఇకపై భారత్ లో ఆపిల్ ఆన్లైన్ స్టోర్ షురూ…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక నుండి ఆపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్ ను సందర్శించి అందులో వారికి కావలసిన ప్రొడక్ట్స్ కొనుగోలు చేసుకోవచ్చు.ఇప్పటినుంచి థర్డ్ పార్టీ పై ఆధారపడకుండా డైరెక్ట్ గా ఆపిల్ సంస్థకు చెందిన వెబ్ సైట్ ద్వారా వినియోగదారుడు ఆపిల్ సంస్థకు చెందిన ప్రొడక్ట్స్ కొనుగోలు చేయవచ్చు.

దీంతో కంపెనీకి కస్టమర్ మధ్య డైరెక్ట్ సపోర్ట్ కూడా వినియోగదారులకు లభించనుంది.వారి కస్టమర్లకు అత్యుత్తమ సేవలు అందించడానికి సంస్థకు సంబంధించి నైపుణ్యం కలిగిన టీం ఆన్ లైన్ లో సిద్ధంగా ఉంటుందని సంస్థ ప్రకటించింది.

దీంతో ఇప్పుడు ఆన్లైన్ స్టోర్ విధానం ద్వారా ఆపిల్ మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా ఉన్న వారి వినియోగదారులకు పూర్తిస్థాయి సేవలను అందించబడుతుంది.ఇక యాపిల్ సంస్థకు సంబంధించిన డెలివరీ లను బ్లూ డార్ట్ తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది ఆపిల్ సంస్థ.

కేవలం ఆపిల్ సంస్థకు చెందిన మొబైల్స్ మాత్రమే కాకుండా మిగతా ఉత్పత్తులు కూడా అందుబాటులో ఉండనున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ 38వ ఆన్ లైన్ స్టోర్ ను ఆపిల్ ఇండియా స్టోర్ ద్వారా వినియోగదారులకు సేవలు అందించబోతోంది.

ఇక ప్రోడక్ట్ ఫీచర్లు లాంటి మొదలగు విశేషాలను పూర్తిగా ఇంగ్లీషులో ఆన్లైన్ విధానం ద్వారా సహాయం అందించనుంది.ఇక ఫోన్ విధానం ద్వారా ఇంగ్లీష్ అలాగే హిందీ లో నేరుగా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ లతో మాట్లాడి సలహాలను తీసుకోవచ్చు.

ఇది వరకు ఆపిల్ సంస్థ భారత దేశంలో వారి మొబైల్స్ అమ్మకానికి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ఆన్లైన్ స్టోర్ లతో కలిసి పని చేయగా ఇప్పుడు వారి సొంత వెబ్సైట్ ద్వారా కార్యకలాపాలను జరపనుంది.ఇక ఈ ఆన్లైన్ స్టోర్ విధానం ద్వారా పాత ఐఫోన్లను ఇచ్చేసి కొత్త ఐఫోన్లను కూడా పొందవచ్చు.

కస్టమర్లకు మరింత చేరువయ్యేలా ఈ ప్రతిపాదనను చేపట్టినట్లు తెలుస్తోంది.

#Products #Online #Customers #Bluedart #Apple Store

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Today Onwords Apple Online Service Available In India Related Telugu News,Photos/Pics,Images..