ఈ రోజు ఐపీఎల్ లో పంజాబ్ తో ముంబై ఇండియన్స్ ఢీ .. ఏ జట్టుకు ఎక్కువ గెలిచే అవకాశం ఉందో చూడండి..

ఐపీఎల్ సీజన్ 12 మ్యాచ్ లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి.ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక విజయం తో ఉన్న పంజాబ్ , ముంబై జట్లు ఈ రోజు మొహాలీ లో తలపడనున్నాయి.

 Today Match In Ipl Is Mumbai Vs Kings Xi Punjab-TeluguStop.com

ముంబై తన గత మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ పైన కష్టపడి గెలిచింది , ముంబై విజయానికి ముఖ్య కారణం ముంబై డెత్ బౌలింగ్ ముఖ్యంగా జస్పిరిత్ బూమ్రా తన చివరి రెండు ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి బెంగళూర్ ని దెబ్బకొట్టాడు.ఇకపోతే పంజాబ్ తన మొదటి మ్యాచ్ లో గెలిచినప్పటికి రెండవ మ్యాచ్ లో కోల్ కత్తా చేతిలో ఓడిపోయింది.

ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ లలో రికార్డ్ ఎలా ఉంది


ముంబై ఇండియన్స్ కి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కి మధ్య ఇప్పటి వరకు 22 మ్యాచ్ లు జరగగా ముంబై 12 గెలిచింది , పంజాబ్ 10 విజయాలు సాధించింది.

పిచ్ ఎలా ఉండబోతుంది


పంజాబ్ సొంత గడ్డ అయిన మొహాలీ లో మ్యాచ్ ఆడనుంది.పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది , మంచి ఓపెనింగ్ స్టాండ్ వస్తే పరుగుల వరద ఖాయం.పంజాబ్ తన చివరి సీజన్ లో ఇక్కడ ఆడిన 3 మ్యాచ్ లలో విజయం సాధించింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ఉండబోతుంది


గత రెండు మ్యాచ్ లలో విఫలం అయిన కె ఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో అయిన రాణిస్తాడో చూడాల్సింది.ఇకపోతే పంజాబ్ బౌలింగ్ లో చాలా బలహీనంగా కనిపిస్తుంది.అశ్విన్ , షమీ లు గత మ్యాచ్ లో పరుగులు ఎక్కువగా సమర్పించుకున్నారు.జట్టులో పెద్దగా మార్పులేమి లేకుండా బరిలోకి దిగొచ్చు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు ( PROBABLE XI )

– కె.ఎల్ .రాహుల్ , క్రిస్ గేల్ , మయంక్ అగర్వాల్ , కరుణ్ నాయర్ , మాన్ దీప్ సింగ్ , డేవిడ్ మిల్లర్ , అశ్విన్ , టై , షమీ , వరుణ్ చక్రవర్తి , ముజీబ్ రెహ్మాన్

ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది


ముంబై గత మ్యాచ్ లో బెంగళూర్ పైన గెలిచి మంచి ఉత్సాహం తో ఉంది.రోహిత్ , బూమ్రా లాంటి స్టార్ ఆటగాళ్లు ఫామ్ లోకి రావడం ముంబై కి ఈ మ్యాచ్ లో బలంగా మారింది.ఇకపోతే లసిత్ మలింగ , బూమ్రా , మార్కడేయ లతో ముంబై బౌలింగ్ పటిష్టంగా ఉంది.బ్యాటింగ్ లో యువరాజ్ , హార్దిక్ లు ఫారం అందుకోవడం ముంబై ని పంజాబ్ కట్టడి చేయడం కష్టమైన పనే .ముంబై గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగొచ్చు.

ముంబై ఇండియన్స్ జట్టు ( PROBABLE XI )

– రోహిత్ శర్మ , డి కాక్ , సూర్య కుమార్ యాదవ్ , యువరాజ్ సింగ్ , కీరాన్ పోలార్డ్ , హార్దిక్ పాండ్య , కృనల్ పాండ్య, మార్కడేయ , లసిత్ మలింగ , మెక్ లారెన్ , బూమ్రా

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube