నేటితో గ‌డువు పూర్తి.. ర‌ఘురామ ఫ్యూచ‌ర్ ఏంటి..?

ఏపీ రాజ‌కీయాల్లో అనూహ్యంగా తెర‌మీద‌కు వ‌చ్చిన వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు వ్య‌వ‌హారం ఇప్ప‌టి వ‌ర‌కు అనేక మ‌లుపులు తిరిగింది.కాగా ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ఓ కొల‌క్కి రాబోతోంది.

 Today Marks The End Of The Year What Is The Future Of Raghurama-TeluguStop.com

ఎందుకంటే వైసీపీ అధిష్టానం ప‌ట్టుబ‌ట్టి బీజేపీపై ఒత్తిడి తీసుకురావ‌డంతో ఎట్ట‌కేల‌కు ర‌ఘురామ‌కు స్పీక‌ర్ ఓంబిర్లా ప‌దిహేను రోజుల్లో వివ‌ర‌ణ ఇవ్వాలంటూ నోటీసులు కూడా ఇచ్చారు.దీంతో ఆయ‌న ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేక‌పోయారు.

ఇక ఆయ‌న‌కు ఇచ్చిన గ‌డువు కూడా నేటితో క్లోజ్ అవుతుండ‌టంతో ఆయ‌న‌పై వేటు వేస్తారా లేదా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

 Today Marks The End Of The Year What Is The Future Of Raghurama-నేటితో గ‌డువు పూర్తి.. ర‌ఘురామ ఫ్యూచ‌ర్ ఏంటి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇక్క‌డే వైసీపీ మ‌రో ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అదేంటంటే ఒకవేళ ఎంపీ రఘురామపై స్పీకర్ అన‌ర్హ‌త వేటు వేయ‌కుంటే పార్లమెంట్ వేదిక‌గా నిర‌స‌న తెలిపేందుకు జ‌గ‌న్ ప్లాన్ వేస్తున్నారు.ఇందుకోసం ఇప్ప‌టికే వైసీపీ ఎంపీల‌కు కూడా సూచ‌న‌లు చేయ‌డంతో వారు కూడా రెడీ అవుతున్నారు.

ఈ క్ర‌మంలో అస‌లు ఏం జ‌రుగుతుందో తేలేందుకు మరికొన్ని గంటలే వేచి చూడాల్సి ఉంది.రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇచ్చే వివ‌ర‌ణ‌పైనే ఆయ‌న‌పై వేటు వేయాలా వద్దా అనే దానిపై నిర్ణ‌యం ఉంటుంద‌ని తెలుస్తోంది.

Telugu Jagan, Ombirla, Raghurama, Sajjala Ramakrishna Reddy, Today Marks The End Of The Year What Is The Future Of Raghurama, Ycp-Telugu Political News

ఇక గడువు దగ్గరపడుతుండ‌టంతో ర‌ఘురామ‌లో టెన్ష‌న్ పెరిగిన‌ట్టు తెలుస్తోంది.ఈ క్ర‌మంలోనే ఆయ‌న వైసీపీపై మాట‌ల దాడిని పెంచేసి చేతులు దులుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.ఇంకా చెప్పాలంటే ర‌ఘురామ కేవ‌లం జ‌గ‌న్‌తో పాటు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపైనే తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేస్తూ విష‌యాన్ని ప‌క్క దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.వారిపై ఉన్న అక్ర‌మ కేసుల‌ను తెర‌మీద‌కు తెస్తూ వాటిపై తాను చేస్తున్న పోరాటాన్ని స్పీక‌ర్ ముందు ఉంచే ప్ర‌య‌త్నంచేస్తున్న‌ట్టు స‌మాచారం.

కాగా దీనిపై అటు వైసీపీకూడా రీ కౌంట‌ర్లు వేసేందుకు రెడీ అవుతోంది.ఇక ర‌ఘురామ మ‌రింత గ‌డువు కోరితే స్పీక‌ర్ ఏ నిర్ణ‌యం తీసుకుంటార‌నేది వేచి చూడాలి.

#Raghurama #Jagan #TodayMarks #Ombirla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు