నేడు బీజేపీ కీల‌క స‌మావేశం.. ఆ మూడింటిపైనే చ‌ర్చ‌

తెలంగాణ రాజ‌కీయాల్లో ఇప్పుడు బీజేపీ స్పీడు మీదుంది.అన్ని పార్టీల కంటే ఓ అడుగు ముందే వేసి చూపిస్తోంది.

 Today Is The Key Meeting Of The Bjp Discussion On All Three, Bjp, Sanjay, Telang-TeluguStop.com

ఇప్ప‌టికే బండి సంజ‌య్ పాద‌యాత్ర‌ల‌తో దూసుక‌పోతుంటే మ‌రోవైపు సెప్టెంబ‌ర్ 17న విమోచ‌న దినాన్ని పెద్ద ఎత్తున చేసి తెలంగాణ ప్ర‌జ‌ల సెంటిమెంట్‌ను ఉప‌యోగించ‌బోతోంది.ఇప్ప‌టికే దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు న‌డుస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌పై కూడా ఫోక‌స్ పెట్టింది.ఇక వీట‌న్నింటిపై ఈ రోజు జోగిపేటలో బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్పుడు ప్ర‌జా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజ‌య్ ఇందులో భాగంగా ఈ రోజు జోగిపేట శ్రీ రామ ఫంక్షన్ హాల్‌లో బీజేపీ ప‌దాధికారుల స‌మావేశాన్ని మధ్యాహ్నం 1గంటలకు నిర్వ‌హించ‌నున్న‌ట్టు స‌మాచారం.అయితే ఈ సమావేశంలో రాష్ట్రంలోని బీజేపీ పార్టీ పదాధికారులు అలాగే జిల్లాల అధ్యక్షుల‌తో పాటు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు కూడా వ‌స్తున్నారు.

ఇక మ‌రీ ముఖ్యంగా పెద్ద లీడ‌ర్లు అయిన బండి సంజయ్ అధ్యక్షతన, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డీకే అరుణ, తరుణ్ ఛుగ్ లాంటి కీల‌క నేత‌లు ఈ స‌మావేశానికి హాజ‌రుకానున్నారు.

Telugu Bandi Sanjay, Bjp, Jogipeta, Kishan Reddy, Prajasangrama, Raja Singh, San

ఇక ఇందులో లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా పాల్గొంటున్న‌ట్టు తెలుస్తోంది.అయితే ఈ సమావేశం బండి సంజయ్ అధ్య‌క్ష‌త‌న ఆయ‌న చేస్తున్న‌టువంటి ప్రజా సంగ్రామ యాత్ర ఏ మేర‌కు స‌క్సెస్ అవుతుందో తెలుసుకోవ‌డానికి, అలాగే సెప్టెంబర్ 17న నిర్మల్‌లో నిర్వ‌హిస్తున్న తెలంగాణ విమోచన దినోత్సవం బహిరంగ సభకు సంబంధించిన పూర్తి ఏర్పాట్ల‌పై అలాగే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికలు ఎలా నిర్వ‌హిస్తున్నామ‌నే దానిపై పూర్తిగా చ‌ర్చించ‌నున్నారు.ఈ మూడింటిపైనే ప్ర‌ధానంగా వారి ఫోక‌స్ ఉండనున్న‌ట్టు తెలుస్తోంది.

మ‌రి ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో తెలియాలంటే క‌చ్చితంగా వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube