నేడు కాంగ్రెస్ అత్యున్న‌త స‌మావేశం.. టీపీసీసీ పై ప్ర‌క‌ట‌న వ‌చ్చే ఛాన్స్‌!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఎప్ప‌టి నుంచో ఊరిస్తున్న ఒకే ఒక్క ఎన్నిక టీపీసీసీ చీఫ్‌.దీనిపై ఇప్ట‌పికే ఎన్నో అంచ‌నాలు, ఎన్నో గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

 Today Is The Highest Meeting Of The Congress Chance To Come Out Publicly On Tpcc-TeluguStop.com

ప‌లానా వ్య‌క్తి పేరు ఖాయ‌మైంద‌ని అనుకునే లోపే కాంగ్రెస్ నేత‌లు వ్య‌తిరేకించ‌డం, మ‌ళ్లీ ఆగిపోవ‌డం కామ‌న్ అయిపోయాయి.ఈ నేప‌థ్యంలోనే రేవంత్ రెడ్డి పేరు తెర‌మీద‌కు రాగా కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లంద‌రూ వ్య‌తిరేకించారు.

ఆయ‌న‌కు ఇవ్వొద్దంటూ ఏకంగా లేఖ‌లు కూడా రాశారు.

 Today Is The Highest Meeting Of The Congress Chance To Come Out Publicly On Tpcc-నేడు కాంగ్రెస్ అత్యున్న‌త స‌మావేశం.. టీపీసీసీ పై ప్ర‌క‌ట‌న వ‌చ్చే ఛాన్స్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో పాలు ద‌ఫాలుగా చివ‌రి వ‌ర‌కు వ‌చ్చిన ఈ ఎన్నిక కాస్తా ఆగిపోతోంది.

అయితే ఇప్పుడు అది మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే రీసెంట్ గా శ‌ర‌ద్ ప‌వార్ అధ్య‌క్ష‌త‌న ముంబైలో 15 పార్టీల మీటింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే.

దీంతో కాంగ్రెస్ అల‌ర్ట్ అయింది.ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈరోజు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్య‌క్షుల‌తో సోనియాగాంధీ అధ్య‌క్ష‌త‌న మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు.

ఇందులో జాతీయ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌తో పాటే తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడి పేరును కూడా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

అయితే ప్ర‌స్తుతం తెలంగాణలోని అన్ని పార్టీలు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల‌పై వ్యూహాలు ర‌చిస్తుంటే టీ కాంగ్రెస్ దీంట్లో ఇంత వ‌ర‌కు ఫోక‌స్ పెట్టేల‌క‌పోతోంది.

ఆ పార్టీ నేత‌లంతా ఎవ‌రికి టీపీసీసీ చీఫ్ ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తార‌నే చూస్తున్నారు.

Telugu #telanganapolitics, All India Nr Congress Party, Komati Reddy Venkat Reddy, Revanth Reddy, Sharad Pawar, Sonia Gandhi Meeting, Telangana Congress, Tpcc Chief-Telugu Political News

మ‌రి అంద‌రూ అనుకుంటున్న‌ట్టుగానే రేవంత్ లేదా వెంక‌ట్ రెడ్డిలో ఎవ‌రికైనా ఇస్తారా లేదా కొత్త వ్య‌క్తి పేరును తెర‌మీద‌కు తీసుకొస్తారా అన్న దానిపై చ‌ర్చ జ‌రుగుతోంది.కాంగ్రెస్ నేత‌లంతా వ్య‌తిరేకిస్తున్న రేవంత్‌కు ఇచ్చే అవ‌కాశం త‌క్కువ‌గానే ఉన్న‌ట్టు ప్ర‌చారంజ‌రుగుతోంది.మ‌రి వెంక‌ట్ రెడ్డికి ఇస్తే ఆయ‌న‌కు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ట్టు లేక‌పోవ‌డం ఇబ్బందిగా మారింది.

వీరిద్ద‌రు కాకుండా పెద్ద లీడ‌ర్ గా ఎవ‌రూ తెర‌మీద‌కు రావ‌ట్లేదు.పైగా దీనిపై తీవ్ర పోటీ ఉండ‌టంతో చాలామంది కామ్ గానే ఉంటున్నారు.

మ‌రి సోనియా గాంధీ ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారో చూడాలి.

#TPCC Chief #AllIndia #SoniaGandhi #Sharad Pawar #Revanth Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు