ఈ రోజు నామినేషన్ వేయబోతున్న గులాబీ బాస్ !  

తెలంగాణాలో మళ్ళీ తమదే విజయం అనే ధీమాతో ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ ఎన్నికల కోసం ఎంతగానో ఎదురుచూశాడు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో…కేసీఆర్ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. వెంకటేశ్వరస్వామి జన్మ నక్షత్రం సమయంలో ఆయన నామినేషన దాఖలు చేయనున్నారు. ఎప్పటిలాగే సెంటిమెంట్‌గా భావించే కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామికి పూజలు చేసిన తర్వాత కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు.

Today Is KCR Nomination-

Today Is KCR Nomination

11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మకరలగ్నం. మధ్యాహ్నం 1.30 నుంచి 2.50 గంటల వరకు కుంభలగ్నం. ఈ రెండు ముహూర్తాల్లో నామినేషన్ వేస్తే కేసీఆర్‌కు రాజయోగం వస్తుందని పండితులు సూచించారు. దీంతో కేసీఆర్ మధ్యాహ్నం 2.30 గంటలకు నామినేషన్ వేసేందుకు ముహూర్తం పెట్టించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే… కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కూడా ఈరోజే నామినేషన్ వేయబోతున్నారు.