ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో సన్ రైజర్స్ పోరు..ఏ జట్టుకి గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి...

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం లో జరగనుంది.

 Today Ipl Match Between Rajasthan Royals And Hyderabad Sunrisers-TeluguStop.com

సన్ రైజర్స్ , రాజస్థాన్ రాయల్స్ జట్లు తమ మొదటి మ్యాచ్ లలో పోరాడి ఓటమి చెందాయి.ఇరు జట్లు ఈ మ్యాచ్ లో గెలుపు కోసం పోటాపోటీగా అడబోతున్నాయి.

రాజస్థాన్ జట్టు తన మొదటి అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లోను మంచి ప్రతిభ కనబరిచింది.ఇకపోతే సన్ రైజర్స్ జట్టు మొదటి మ్యాచ్ లో బ్యాటింగ్ బాగా చేసిన బౌలింగ్ విఫలమవడంతో మ్యాచ్ ని చేజార్చుకుంది.సన్ రైజర్స్ బెస్ట్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు రికార్డ్ ఎలా ఉంది


ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 9 మ్యాచ్ లు జరగగా సన్ రైజర్స్ 5 మ్యాచ్ లు గెలవగా రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్ లలో విజయం సాధించింది.

పిచ్ ఎలా ఉండబోతుంది


హైదరాబాద్ లోని ఉప్పల్ లో మ్యాచ్ జరగబోతుంది.ఇక్కడి పిచ్ స్పిన్నర్లకి బాగా అనుకూలిస్తుంది , పిచ్ స్లో ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి.ఈ పిచ్ పైన మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు పరుగులు 165 , ఒకవేళ టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి.

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది


తొలి మ్యాచ్ లో విజయం అంచుల వరకు వచ్చి ఓటమి చెందిన రాజస్థాన్ , మొదటి మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.బట్లర్ , రహానే , స్టీవ్ స్మిత్ , శాంసన్ , త్రిపాఠి లాంటి బ్యాట్స్ మెన్ లతో ఆ జట్టు బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తుంది.ఇకపోతే బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ , బెన్ స్టోక్స్ , ఉనత్కత్ లతో బానే ఉంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టు

( PROBABLE XI ) – అజింక్య రహానే , స్టీవ్ స్మిత్ , జొస్ బట్లర్ , సంజు శాంసన్, బెన్ స్టోక్స్ ,రాహుల్ త్రిపాఠి , జోఫ్రా ఆర్చే ,జయదేవ్ ఉనాధ్కట్ , వరుణ్ ఆరోన్ ,గౌతమ్ శ్రేయస్ గోపాల్

హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు ఎలా ఉండబోతుంది


గత మ్యాచ్ లో డెత్ ఓవర్లలో బౌలింగ్ మినహాయించి అన్ని విభాగాల్లో హైదరాబాద్ జట్టు మంచి ఆటను ప్రదర్శించింది.చాలా మ్యాచ్ ల తరువాత సన్ రైజర్స్ కి ఆడిన డేవిడ్ వార్నర్ ఫామ్ లోకి రావడం జట్టుకి బ్యాటింగ్ లో మరింత బలాన్ని ఇచ్చింది.మొదటి మ్యాచ్ లో ఆడిన జట్టు తోనే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు

(PROBABLE XI ) – డేవిడ్ వార్నర్ , జానీ బైర్ స్టో , మనీష్ పాండే , విజయ్ శంకర్ , యూసుఫ్ పఠాన్ , దీపక్ హుడా , షాకిబ్ ఆల్ హసన్ , రషీద్ ఖాన్ , భువనేశ్వర్ కుమార్ , సిద్దార్థ్ కౌల్ , సందీప్ శర్మ

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube