ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో ముంబై మ్యాచ్.. ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి...  

Today Ipl Match Between Mumbai Vs Rajasthan-mumbai Indians,rahane,rajastan Royals,rohith Sharma,today Ipl Match,ఐపీఎల్,ముంబై ఇండియన్స్ జట్టు,రాజస్థాన్ రాయల్స్ జట్టు

 • ఈ సీజన్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉన్న వరుసగా ఓటమి పాలవుతూ వస్తుంది. వారి గత మ్యాచ్ లో చెన్నై జట్టు పై గెలుపు ముంగిట వరకు వచ్చి ఓటమి పాలయ్యారు.

 • ఈ రోజు ఐపీఎల్ లో రాజస్థాన్ తో ముంబై మ్యాచ్.. ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఉన్నాయో చూడండి...-Today IPL Match Between Mumbai Vs Rajasthan

 • రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ లో ఎక్కువగా జాస్ బట్లర్ పైనే ఎక్కువగా ఆధారపడటం వల్ల అతను ఆడనపుడు జట్టు భారీ స్కోర్ చేయలేకపోతుంది. బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ , ఉన్నాద్కట్ , శ్రేయస్ గోపాల్ తో బలంగా ఉంది.

 • ఇకపోతే ముంబై ఇండియన్స్ జట్టు గత మ్యాచ్ లో పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్ తో భారీ లక్ష్యాన్ని ఛేదించి మంచి ఊపు మీద ఉంది. ఆ జట్టు టాప్ ఆర్డర్ వరుసగా విఫలమవుతుంది.

 • రోహిత్ శర్మ గాయం ఆ జట్టు బ్యాటింగ్ ని కాస్త బలహీనంగా మార్చింది.

  ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల రికార్డ్ లు ఎలా ఉన్నాయి

  Today IPL Match Between Mumbai Vs Rajasthan-Mumbai Indians Rahane Rajastan Royals Rohith Sharma Today Ipl ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్

  ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 19 మ్యాచ్ లు జరగగా ముంబై ఇండియన్స్ జట్టు 10 మ్యాచ్ లు గెలవగా , 8 మ్యాచ్ లలో రాజస్థాన్ గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

 • పిచ్ ఎలా ఉండబోతుంది

  రాజస్థాన్ తో ముంబై మ్యాచ్ ముంబై లోని వాన్ఖడే స్టేడియం లో జరగనుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్ కి అనుకూలించనుంది.

 • టాస్ గెలిచిన జట్టు లక్ష్య చేదన చేయడానికి ఆసక్తి చూపుతుంది.

  రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలా ఉండబోతుంది

  Today IPL Match Between Mumbai Vs Rajasthan-Mumbai Indians Rahane Rajastan Royals Rohith Sharma Today Ipl ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్

  రాజస్థాన్ రాయల్స్ ఆడిన 6 మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ లొనే గెలుపొంది పాయింట్ ల పట్టికలు బెంగళూర్ తో పాటు అట్టడుగున ఉంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ కి వెళ్లే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

 • ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి మళ్ళీ విజయాల బాట పట్టాలనుకుంటుంది. బట్లర్ , సంజు శాంసన్ , రహానే లలో ఎవరో ఒకరు భారీ ఇన్నింగ్స్ ఆడితే ఆ జట్టు భారీ పరుగులు చేసే అవకాశం ఉంటుంది.

 • రాజస్థాన్ జట్టు కి ఏదైనా ప్రతికులాంశం ఉందంటే అది ఆ జట్టు బౌలింగ్ , ఫీల్డింగ్ మాత్రమే.

  రాజస్థాన్ రాయల్స్ జట్టు ( PROBABLE XI )

  – అజింక్య రహానే , జాస్ బట్లర్ , సంజు శాంసన్ , రాహుల్ త్రిపాఠి , స్టీవ్ స్మిత్ , బెన్ స్టోక్స్ , జోఫ్రా ఆర్చర్ , గౌతమ్ , శ్రేయస్ గోపాల్ , ఉనత్కట్ , ధవాల్ కులకర్ణి

  ముంబై ఇండియన్స్ జట్టు ఎలా ఉండబోతుంది

  Today IPL Match Between Mumbai Vs Rajasthan-Mumbai Indians Rahane Rajastan Royals Rohith Sharma Today Ipl ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్

  ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ గాయం కారణంగా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన పొలార్డ్ బ్యాటింగ్ లో విధ్వంస ఆటని ప్రదర్శించి ముంబైకి విజయన్నందించాడు.రాజస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో టాప్ ఆర్డర్ మంచి ఆరంభాన్ని అందిస్తే ముంబై భారీ స్కోర్ ని చేసే అవకాశాలు ఉంటాయి.

 • ఇకపోతే బౌలింగ్ లో బుమ్ర తో సహా ఏ ఒక్క బౌలర్ కట్టుదిట్టంగా బౌలింగ్ వేయలేకపోతున్నారు. రాజస్థాన్ తో ఆడే ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆఫ్స్ రేస్ లో ముందుకి వెళ్లాలనుకుంటుంది.

 • ముంబై ఇండియన్స్ జట్టు (PROBABLE XI )

  సిద్దేష్ లద్ , డికాక్ / ఈవిన్ లెవీస్ , సూర్య కుమార్ యాదవ్ , ఇషాన్ కిషన్ , పొలార్డ్ , హార్దిక్ పాండ్య , కృనల్ పాండ్య , మార్కడేయ , బుమ్ర , బెహరోడాఫ్ , జోసెఫ్