బంగారం ప్రియులకు గుడ్ న్యూస్: అమాంతం తగ్గిన బంగారం, వెండి ధరలు...!

అంతర్జాయతీయంగా 2020 సంవత్సరం మొదలైనప్పటి నుండి బంగారం, వెండి ధరలు రాకెట్ వేగం తో దూసుకు వెళ్తున్నాయి.35000 – 40000 నడుమ ఉన్న బంగారం ధర ఏకంగా ఇప్పుడు రూ.52000 కు చేరుకుంది.గరిష్టంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.57,000 కు పైగా చేరుకుంది.ఇకపోతే గత పది రోజుల నుండి బంగారం వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.

 Gold And Silver Prices Fall,coronavirus, Gold, Silver, Covid 19, Investors, Pric-TeluguStop.com

వరుసగా రెండు రోజుల నుంచి క్షీణిస్తున్న బంగారం ధర విలువ చూసి బంగారం ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కేవలం బంగారం మాత్రమే కాకుండా అదే దారిలో వెండి కూడా మరింతగా క్షీణించింది.

బంగారం ధర పెరుగుదల ఏ విధంగా త్వరత్వరగా పెరిగిందో పతనం కూడా అదే మాదిరిగా కొనసాగుతోంది.ఇక గత వారం రోజుల నుండి బంగారం ధర పది గ్రామాలకు 5000 రూపాయలకు పైగా పతనమైంది.

అలాగే వెండి ధర కూడా తొమ్మిది వేలకు పైగా క్షీణించింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు తగ్గడానికి గల కారణం… ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీలు కరోనా వ్యాక్సిన్ ని కనుగొనడంలో విజయవంతం అవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం, వెండి లపై మొగ్గుచూపడం తగ్గించారు.

అంతేకాకుండా ఇన్వెస్టర్లు బంగారం, వెండి పై కావలసినంత లాభాలు స్వీకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ధరలు నేలచూపులు చూస్తున్నాయి.

Telugu Coronavirus, Covid, Gold, Investors, Silver-General-Telugu

ఇక నేడు బంగారం, వెండి ధరలు విషయానికొస్తే… హైదరాబాద్ మహానగరంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.55,470 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ద్వారా రూ.50,850 గా ఉంది.ఇక కేజీ వెండి ధర రూ.67000 గా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube