ఏపీ క్యాబినెట్ భేటీ ? తీసుకోబోతున్న కీలక నిర్ణయాలు ఇవే ?

రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలు ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు తీర్పులు, సంక్షేమ పథకాల అమలు ఇలా అన్ని విషయాలపైనా, చర్చించేందుకు ఈరోజు ఏపీ క్యాబినెట్ అత్యవసరంగా సమావేశం కాబోతోంది.ఈ సమావేశంలో ఏపీ కి సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నారు.

 Today Ap Cm Jagan Cabinet Meeting Discussion About Main Key Elements, Ap Cm Jaga-TeluguStop.com

ముఖ్యంగా త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలు నిర్వహణతో పాటు, మద్యం అక్రమాలపై ప్రభుత్వానికి ఎక్కువగా చెడ్డపేరు వస్తుండడంతో పాటు, సొంత పార్టీ నాయకులు అసంతృప్తి నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, అలాగే విలేజ్ క్లినిక్ లతోపాటు మొత్తం 40 అంశాలపై మంత్రివర్గ మండలి చర్చించి ఆమోదించాలని భావిస్తున్నారు.అలాగే నూతన పారిశ్రామిక విధానంపైన క్యాబినెట్ ఆమోదం తెలుపుకునే అవకాశం కనిపిస్తోంది.

అలాగే రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యలపైన, వాటి పరిష్కార మార్గాలపైన కేబినెట్లో చర్చినబోతున్నారు.

Telugu Ap Assembly, Ap Cm Jagan, Jagan, Liquor, Publicwelfare-Political

ఈ సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ కేబినెట్ భేటీలో ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలా వద్దా అనే విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.బడ్జెట్ సమావేశాలు కరోనా వైరస్ కారణంగా వాయిదా వేయాలా నిర్వహించాలనే దానిపై క్యాబినెట్ కీలకంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది.

కేబినెట్ భేటీలో తీసుకునే కీలక అంశాలు

  • 40 , 60 ఏళ్ల వయస్సు కలిగిన బిసి, ఎస్సీ, ఎస్టి, మైనారిటీ మహిళలకు 75000 ఆర్థిక సహాయం అందించే వైయస్సార్ చేయూత పథకానికి ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది.
  • చిరు వ్యాపారులకు ప్రభుత్వ సహాయం అందించే పథకంపై క్యాబినెట్ చర్చించబోతోంది.

  • మూడవ సవరణ బిల్లు ముసాయిదాపై చర్చించే అవకాశం ఉంది.అలాగే పోలీస్ శాఖలో 40 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ విషయం లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.

  • పర్యావరణ, జిఎస్టి, ఉన్నత విద్యా కమిషన్, సవరణ బిల్లుపైన చర్చించే అవకాశం కనిపిస్తోంది.
  • రాష్ట్రంలో తెలుగు అకాడమీ ఏర్పాటుపై కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.

    వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలని చూస్తోంది.

  • కురుపం ఇంజనీరింగ్ కాలేజీ, మూడు నర్సింగ్ కాలేజీలకు ఆమోదం తెలిపే ఈ విషయం పైన ప్రధానంగా చర్చించబోతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube