బర్గర్ కోసం రూ. 66 వేలు చెల్లించినా దొరకని బర్గర్... స్టోరీలో ట్విస్ట్ ఇదే!

అదేంటి బర్గర్ కోసం రూ.66 వేలు చెల్లించినా బర్గర్ దొరకలేదా? అందులో అంత విషయం ఏముంది అని ఆశ్చర్యం కలుగుతోంది కదూ.ఆ తంతు ఏమిటో తెలియాలంటే మీరు ఈ కథ పూర్తిగా చదవాల్సిందే.బర్గర్ అనేది చాలా మంది ఫేవరేట్ ఫుడ్ చాయిస్‌గా మారింది నేడు.

 Toby Wilson Pay Rs. 66 For Burger By Mistake Not Refund Money , This Is T-TeluguStop.com

అయితే బర్గర్ ఎలాంటి బడ్జెట్‌లోనైనా అందుబాటులో ఉంటుంది.రకరకాల ఫ్లేవర్‌లతో నోరూరిస్తూ కనిపించే బర్గర్ చిన్నపిల్లలనుండి పెద్దవాళ్లవరకు అందరినీ ఊరిస్తూ ఆకట్టుకుంటుంది.

అందుకే దానికి ఎంతపేరు.దానిని ముఖ్యంగా మినీ మీల్‌గానో.

ఈవెనింగ్ స్నాక్ గానో తింటూ వుంటారు.

Telugu Burger, Delivered, Paied, Toby Wilson, Latest-Latest News - Telugu

UKకు చెందిన 35 ఏళ్ల టాబి విల్సన్ కి బర్గర్ అంటే పిచ్చి.ఓ రోజు రాత్రి 11 తర్వాత ఇంటికి వెళ్లుతున్న దారిలో ఫుడ్ ట్రక్ కనిపించగానే అక్కడ వున్న బర్గర్ అతగాడిని ఊరించింది.దాంతో మారు ఆలోచించకుండా తినేసి బిల్లు కట్టి ఇంటికి వెళ్ళాడు.

ఆ తర్వాత తీరిగ్గా తన బ్యాంక్ అకౌంట్ స్టేటస్ చూస్తున్నప్పుడు ఖంగు తిన్నాడు.విషయం ఏమంటే బర్గర్‌కు తాను చెల్లించాల్సిన దానికంటే చాలా ఎక్కువ పే చేశానని అర్థం చేసుకున్నాడు.

బర్గర్ లైట్ మీల్‌గా కాకుండా ఆ బర్గర్ తన జీవితంలోనే ఖరీదైన మీల్‌ అవుతుందని అతగాడు అస్సలు ఊహించుకోలేదు.

Telugu Burger, Delivered, Paied, Toby Wilson, Latest-Latest News - Telugu

దాంతో తన మిత్రులను వెంటేసుకొని మనోడు ఆ ఫుడ్ ట్రక్ వద్దకు వెళ్లి ఎక్కువ అమౌంట్ చెల్లించామని, కనుక దానిని రీఫండ్ చేయాలని సూచించాడు.అంతేకాకుండా బ్యాంకు వాళ్లతో మాట్లాడాల్సిందిగా ఆ ఫుడ్ ట్రక్ కంపెనీ HR మేనేజర్ అహ్మద్ అబ్దుల్లాని సూచించాడు.అయితే నెల రోజులు గడిచినా ఆ మేనేజర్‌కు టాబీకి మధ్య సమన్వయం కుదరకపోవడం కొసమెరుపు.

ఆ డబ్బు ఇంకా రిఫండ్ కాలేదు.వారిది పెద్ద కంపెనీ అనీ, చాలా రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుందని బ్యాంకు వారికి వివరంగా చెప్పానని, కానీ, వారు అంగీకరించడం లేదని టాబీ అన్నారు.

ఇక సదరు బ్యాంకు వారికి మాత్రం అనుకోకుండా టాబీ ఎక్కువ అమౌంట్ చెల్లించాడని అహ్మద్ అబ్దుల్లా చెబితే చాలు అని అంటున్నారు.విషయం ఎప్పుడు కొలిక్కి వస్తుందో అని మన టాబీ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube