పట్టు లేని పార్టీని ప్రవీణ్ ఏ మేరకు నడిపిస్తారు?

మాజీ ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.ఎస్.

 To What Extent Does Praveen Lead A Party That Has No Grip, Rs Praveen Kumar, Pol-TeluguStop.com

ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఎస్పీలో చేరుతున్నారు.అయితే, తెలంగాణలో బీఎస్పీకి పొలిటికల్ బేస్ ప్లస్ కేడర్ అంతంత మాత్రంగానే ఉంది.

ఈ నేపథ్యంలో ప్రవీణ్ పార్టీని ఏ మేరకు నడిపించగలరు? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది.

బీఎస్పీ జాతీయ నేత రాంజీ గౌతం ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జీ కాలేజ్‌లో ‘రాజ్యాధికార సంకల్ప సభ’ పేరిట జరిగే సభలో డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బీఎస్పీలో చేరుతున్నారు.అయితే, సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శిగా ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఉన్న సమయంలో ఆయన స్వేరోస్ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నారు.ఈ నెట్‌వర్క్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉండగా, కంపల్సరీ స్వేరోస్, బీఎస్పీ కార్యకర్తలు తనకు సపోర్ట్‌గా ఉంటారని భావిస్తున్నారు.

అయితే, రాజకీయ పార్టీ నడవాలంటే నేతలు కూడా ముఖ్యం.కాబట్టి నియోజకవర్గంలో బలమైన నేతలను ఏర్పరుచుకోవాల్సిన అవసరముంటుంది.ప్రవీణ్ ఈ విషయమై ఏ మేరకు దృష్టి సారిస్తారో చూడాలి.ఇకపోతే ఇది కేవలం దళితుల పార్టీగానే ఉండకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.

అన్ని సామాజిక వర్గాల ప్రజలను అట్రాక్ట్ చేసేలా పార్టీ పాలసీ ఉండేందుకు ఎలాంటి ప్రణాళికలు రచిస్తారు? అనేది కొద్ది కాలం తర్వాత అంచనా వేయొచ్చు.

Telugu Praveen Kumar, Bsp, Mayawati, Nalgonda, Ramji Gowtham, Retired Ips-Telugu

ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న అధికార టీఆర్ఎస్ పార్టీ బలాన్నిలెక్క కట్టుకునే నిర్దిష్టమైన ప్రణాళికలు రచించుకుంటేనే బీఎస్పీకి పొలిటికల్ స్పేస్ ప్లస్ సర్వైవల్ ఉండే చాన్సెస్ ఉంటాయని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతరేకంగా బలంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోరాడేందుకు సిద్ధమవుతున్న క్రమంలో మరో పొలిటికల్ పార్టీ రావడం ద్వారా రాజకీయం మరింత వేడెక్కిందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే, కాన్షీరాం అడుగుజాడల్లో నీలి తెలంగాణ కోసం ప్రవీణ్ చేయబోయే పోరాటానికి బహుజన మేధావుల మద్దతు తప్పక ఉంటుందని ప్రవీణ్ వర్గీయులు పేర్కొంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube