సంతానం కలగాలంటే వినాయకుడిని దొంగతనం చేయాలని మీకు తెలుసా?

కోరిన కోరికలు నెరవేరాలంటే, మనం చేసే కార్యంలో ఏ ఆటంకాలు లేకుండా ఉండాలంటే మనం మనస్ఫూర్తిగా ప్రథమ పూజ్యుడైన వినాయకుడికి పూజ చేయాలని చెబుతుంటారు.వినాయకుడికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదని పండితులు చెబుతుంటారు.

 To Steal Ganesha In Order To Have Children-TeluguStop.com

అందుకోసమే సంతానం లేని వారు సంతానం కోసం పుత్ర గణపతి వ్రతం చేయటం వల్ల సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.వినాయకుడికి పూజ చేయటం వల్ల సంతానం ఎలా కలుగుతుందో అనే దాని గురించి పురాణాలలో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది.

మరి అది ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

 To Steal Ganesha In Order To Have Children-సంతానం కలగాలంటే వినాయకుడిని దొంగతనం చేయాలని మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పురాణాల ప్రకారం రాక్షస సంహారం చేసిన వినాయకుడిని దేవతలందరూ ఎంతో గొప్పగా పొగుడుతాడు.

ఈ విధంగా దేవతలందరూ కైలాసం చేరుకొని గణనాథుడి పై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే తన తల్లి పార్వతి దేవి ఎంతో మురిసి పోతుంది.ఈ క్రమంలోనే ఇటువంటి పుత్రుడు నాకి ఉంటే ఎంత బాగుండేదో అనే కోరిక లక్ష్మీదేవికి కలిగింది.

ఈ విషయమే విష్ణుమూర్తితో చెప్పగా ఆ పార్వతి కొడుకే నాకు పుత్రుడుగా కావాలని విష్ణుమూర్తిని అడగగా అందుకు స్వామివారు నువ్వే వినాయకుడికి ప్రార్థించు అని సలహా ఇస్తారు.

Telugu Children, Ganesh, Lakshmi Devi, Tulasi Pooja-Telugu Bhakthi

విష్ణు దేవుడు మాటలు విన్న లక్ష్మీదేవి ఎలాగైనా వినాయకుడిని తన పుత్రుడిగా పొందాలని భావించిన తపస్సు చేయాలని నిర్ణయించుకుంది.ఈ విధంగా వినాయకుడి కోసం తపస్సు చేయగా వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై లక్ష్మీదేవి ముందు నిలబడి అమ్మ అని పిలిచాడు.ఈ క్రమంలోనే లక్ష్మీదేవి ఈ పిలుపు నీ నుంచి నాకు శాశ్వతంగా కావాలి నాయనా అని అడగగా అందుకు వినాయకుడు అది నాకు ఒక వరం తల్లి అలాగే కానివ్వు అని వినాయకుడు చంటి బిడ్డగా మారడంతో లక్ష్మీదేవి అతనిని తీసుకొని వైకుంఠం చేరుకుంటుంది.

ఈ విధంగా లక్ష్మీదేవి మాయ చేసి తన కుమారుడిని దొంగలించడం చూస్తున్న పార్వతీపరమేశ్వరులు ఎంతో ముచ్చట పడి పడి నవ్వుకుంటారు.

ఈ విధంగా వైకుంఠం తీసుకెళ్లిన వినాయకుడికి లక్ష్మీదేవి పూర్ణ నందుడు అని నామకరణం చేసింది.

వినాయకుడికి వైకుంఠంలోని పూర్ణం, బూరెలు అలవాటయ్యాయి.ఈ విధంగా వైకుంఠంలో ఎంతో ఆనందపడుతూ వినాయకుడిని ఆడిస్తున్న లక్ష్మీదేవికి దేవతలందరూ కలిసి రాక్షసుల సంహారం తన కొడుకును పంపించాలని కోరుతారు.

అప్పుడు లక్ష్మీదేవి తన బిడ్డ చాలా చిన్నగా ఉన్నాడు కనుక యుద్ధానికి పంపని చెబుతారు.ఆ సమయంలో విష్ణుమూర్తి మన కొడుకు రాక్షస సంహారం చేసి వస్తే మనకు ఎంతో గర్వకారణం అని చెప్పి యుద్ధానికి ఒప్పిస్తాడు.

యుద్ధంలో రాక్షస సంహారం చేసిన తరువాత దేవతలందరి పూర్ణనందుడు ను ఎంతో గొప్పగా ప్రశంసిస్తారు.ఆ సమయంలో వినాయకుడు లక్ష్మీదేవితో తల్లి నీవు ఎప్పుడు తెలిస్తే అప్పుడు నీ చెంత ఉంటాను అని చెప్పి వైకుంఠం కైలాసం వెళ్ళాడు.

Telugu Children, Ganesh, Lakshmi Devi, Tulasi Pooja-Telugu Bhakthi

అందుకే విష్ణు ఆలయంలో వినాయకుడు విశ్వక్సేనుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు.శివాలయంలో, వినాయకుడి గుడిలో తులసి వాడరు.అందుకే సంతానం లేని స్త్రీ లు దంపతులు ఎవ్వరైనా వినాయకుడిని దొంగతనం చేసి సంతానం కోసమే తనని దొంగలించారని క్షమాపణ చెబుతూ స్వామివారికి నిత్యం పూజలు చేయడం వల్ల వారికి సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.సంతానం నుండి మరొక సంతానం కోసం వినాయకుడిని దొంగతనం చేయకూడదు.

అయితే ఈ విధమైనటువంటి వినాయకులను ఎవరి ఇంట్లో నుంచి అయినా లేదా షాప్ లో నుంచి అయినా దొంగతనంగా తీసుకురావటం వల్ల వారికి సంతానం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

#Tulasi Pooja #Lakshmi Devi #Ganesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU