ప్రభుత్వం బంపర్ ఆఫర్.. పెళ్లి చేసుకుంటే 5 లక్షల రూపాయలు!

ఈ మధ్య కాలంలో పెళ్లి ఖర్చులు భారీగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.కరోనా, లాక్ డౌన్ వల్ల చాలామంది తక్కువ ఖర్చుతో పరిమిత సంఖ్యలో బంధుమిత్రులతో వివాహం చేసుకుంటున్నారు కానీ సాధారణ పరిస్థితులు ఏర్పడితే మాత్రం పెళ్లి చేసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిందే.

 Japan Government Will Give 4.50 Lakhs To Couples, Japan Government,low Birth Rat-TeluguStop.com

అయితే మన దేశంలో పెళ్లిళ్లకు ప్రభుత్వాలు ఎటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వవు.ప్రలు రాష్ట్రాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నా లక్ష రూపాయల లోపు మాత్రమే ఇస్తాయి.

అయితే జపాన్ లో మాత్రం వింత పరిస్థితి నెలకొంది.అక్కడి ప్రభుత్వం పెళ్లి చేసుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది.రోజురోజుకు జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ఇలాంటి వింత నిర్ణయం తీసుకుంది.రెండేళ్ల క్రితం జపాన్ జనాభా 12.65 కోట్లు కాగా 2020 నాటికి ఆ సంఖ్య భారీగా తగ్గింది.జపాన్ ప్రభుత్వం చేసిన సర్వేల్లో యువత పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపకపోవడం వల్లే జనాభా క్రమంగా తగ్గుతోందని తేలింది.
దీంతో ప్రభుత్వం యువత పెళ్లిళ్లపై దృష్టి పెట్టింది.పెళ్లి చేసుకున్న జంటకు ¥600000 ఇస్తామని ప్రకటించింది.మన దేశ కరెన్సీలో దాదాపు 4,50,000 లక్షలు ఇస్తామని పేర్కొంది.ఇప్పటికే తక్కువ సంఖ్యలో జనాభా ఉందని బాధ పడుతున్న ఆ దేశానికి ఎక్కువ సంఖ్యలో వయోవృద్ధులు ఉండటం మరింత టెన్షన్ పెడుతోంది.

దీంతో ప్రభుత్వం పెళ్లి చేసుకునే యువతకు ప్రోత్సాహకాల దిశగా అడుగులు వేస్తోంది.

యువతలో కొందరు ఆర్థిక సమస్యల వల్ల పెళ్లి చేసుకోవడం లేదని తేలడంతో వారికి ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే దిశగా జపాన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.

పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో జపాన్ లో యువత కంటే వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.గతేడాది జపాన్ లో జననాల సంఖ్య కంటే మరణాల సంఖ్య ఆరు లక్షలు ఎక్కువగా ఉండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube