సికింద్రాబాద్ రైల్వేస్టేష‌న్ నుంచి జ‌ర్నీ చేయాలంటే కంప‌ల్సరీ ఇది చేయాలంట‌..

మ‌న‌కు హైద‌రాబాద్ అన‌గానే ప్ర‌యాణం విష‌యంలో గుర్తుకు వ‌చ్చేది సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్.దేశంలో ఎక్క‌డ‌కు వెళ్లేందుకు అయినా ఈ రైలు మార్గాలు ఎంతో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

 If You Want To Make A Journey From Secunderabad Railway Station You Have To Do I-TeluguStop.com

సికింద్ర‌బాద్ రైల్వే స్టేష‌న్ నుంచి దేశంలోని చాలా పెద్ద ప‌ట్ట‌ణాల‌కు కూడా లైన్ క‌లుపుతూ ఉండ‌టం వ‌ల్ల ఇక్క‌డ నుంచే ప్ర‌యాణాలు చేసేందుకు అంద‌రూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.కాగా ఇప్పుడు ఇక్క‌డి నుంచి ప్ర‌యాణం చేయాలంటే కొత్త రూల్ తీసుకొచ్చారు అధికారులు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇక నుంచి ఆ కొత్త రూల్ అమ‌లు కానుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు సికిద్రాబాద్ నుంచి జనరల్ బోగీలో జర్నీకి ఒక విధానం ఉండేది.

కానీ ఇక నుంచి ఆ విధానానికి అధికారులు బ్రేక్ వేసేశారు.ఇక‌ నుంచి ట్రైన్‌లో ప్ర‌యాణం చేయాలంటే క‌చ్చితంగా ట్రైన్ స‌మ‌యానికి పావు గంట ముందే ఉండాలి.

ఇలా పావుగంట ముందే ఉండి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.ఇక ఇలా టికెట్ తీసుకున్న త‌ర్వాత కంప‌ల్స‌రీ టోకెన్ తీసుకోవాల‌ని చెబుతున్నారు.

కొత్త‌గా బయోమెట్రిక్ టోకెన్ విధానాన్ని మాత్ర‌మే అధికారులు ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తెచ్చారు.ఇప్ప‌టి వ‌ర‌కు టికెట్ తీసుకోవటం అనేది ఇంత‌కు ముందు ఉన్న విధాన‌మే.

Telugu Biometric Token, Fingerprint, Railway, Reigister, Secunderabad-Latest New

కానీ కొత్త‌గా బయోమెట్రిక్ విధానాన్ని తీసుకు వ‌చ్చారు.అంటే ఈ బ‌యోమెట్రిక్ మిష‌న్‌లో ప్యాసింజ‌ర్ క‌చ్చితంగా వేలి ముద్రలు వేయాల్సి ఉంటుంది.ప్యాసింజ‌ర్ త‌న పేరుతో పాటు ఏ ప్రాంతం నుంచి ఎక్కడ దాకా ప్రయాణం చేయాల‌నుకుంటున్నారో అందులో పొందుప‌రచాలి.అంతే కాదండోయ్ ఇందులో ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది.ఇలా ప్రాసెస్ కంప్లీట్ చేశాక టోకెన్ ఇస్తారు.ఇక ఇందులో ఒక ఆప్ష‌న్ ఏంటంటే అన్ రిజర్వ్ అయిన వారికి కూడా ఒక కోచ్ కేటాయిస్తారు.

ఇలా ప్రాసెస్ పూర్తి చేసుకున్న వారు రైలు టైమ్‌కు పావు గంట ముందు ఉండి తాము తీసుకున్న టోకెన్ చూపిస్తేనే సిబ్బంది అనుమ‌తిస్తారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube