ట్రంప్ కొత్త మెలిక...!!

అమెరికా అధ్యక్షుడిగా తాను ఓడిపోలేదని, వైట్ హౌస్ వీడే ప్రసక్తి లేదని బల్లగుద్ది మరీ చెప్పిన డోనాల్డ్ ట్రంప్, బిడెన్ గెలుపును ఇప్పటికి కూడా అంగీకరించలేక పోతున్నారు.అయితే కూతురు ఇవాంకా, రిపబ్లికన్ పార్టీ నేతల ఒత్తిడుల మేరకు ఎట్టకేలకు ఓ మెట్టు దిగిన డోనాల్డ్ ట్రంప్ తాను అధికార బదలాయింపు కు సహకరిస్తానని ప్రకటించారు.

 Trump's New Twist, 528 Electoral, Donald Trump, Joe Biden, Kamala Harries, Ivank-TeluguStop.com

దాంతో మళ్ళీ ట్రంప్ ఎక్కడ యూ టర్న్ తీసుకుంటాడో నని తమ పని మొదలు పెట్టేసింది.అయితే అందరూ అనుకున్నట్టుగానే ట్రంప్ అధికార బదలాయింపుకు ఒప్పుకునే మరో మెలిక పెట్టేశాడు.

వైట్ హౌస్ ను తాను వీడటానికి అభ్యంతరం ఏమి లేదని అయితే బిడెన్ గెలుపును ఎలక్టోరల్ కాలేజీ ఫైనల్ చేసిన తరువాత మాత్రమే తాను వైట్ హౌస్ ను వీడుతానని అంత వరకూ తాను వైట్ హౌస్ వదిలి వెళ్ళాలని బాంబు పేల్చారు.అమెరికా వ్యాప్తంగా దాదాపు 50 రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో కలిపి 528 ఎలక్టోరల్ ఉంటాయి.

ఇందులో బిడెన్ కు 306 ఓట్లు రాగా ట్రంప్ కు 232 ఓట్లు పడ్డాయి.అధికారం చేపట్టాలంటే 270 ఓట్లు వస్తే సరిపోతుంది ఈ లెక్కల్లో బిడెన్ గెలుపు అఫీషియల్ గా వెలువడక పోయినా అనఫీషియల్ గా మాత్రం బిడెన్ అధ్యక్షుడు అని అందరికి తెలిసిందే.కాగా …

Telugu Electoral, Donald Trump, Ivanka Trump, Joe Biden, Kamala, Trump White, Tr

డిసెంబర్ 14 వ తేదీన ఎలక్టోలర్స్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో ఎన్నిక కాబడిన వారందరూ సమావేశం అవుతారు.అందులో అందరి మద్దతు బిడెన్ సంపాదించుకోవాలని సవాలు విసిరారు.బిడెన్ అందరిచే ఎంనుకోబడితే తప్పకుండా నేను వైట్ హౌస్ వీడి వెళ్తానని అప్పటి వరకూ వెళ్ళాలని స్పష్టం చేశారు.

ఇదిలాఉంటే ట్రంప్ తాజా వ్యాఖ్యలపై డెమోక్రటిక్ పార్టీలో ఆందోళన నెలకొంది.ఈ సమావేశంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డెమోక్రటి నేతలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube