బోల్డ్ వీడియో ఎఫెక్ట్.. నా మనసు చాలా సున్నితం మీరు ఇంతలా దిగజారకండి: పాయల్ రాజ్ పుత్

ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ ను ఏర్పరచుకుంది.

 Payal Rajput Reacts To Trolls Against Her Photoshoot On Social Media Details,  B-TeluguStop.com

ఆ తరువాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.

తరచు హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.అంతేకాకుండా అప్పుడప్పుడు హాట్ ఫొటో షూట్ చేస్తూ తన అందాలతో కనువిందు చేస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా పాయల్ రాజ్ పుత్ ఫొటో షూట్స్ సందర్భంగా వస్త్రధారణ విషయంలో జరిగే కొన్ని పొరపాట్లను భూతద్దంలో పెట్టి చూడవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇటీవలే పాయల్ రాజ్ పుత్ హాట్ ఫొటో షూట్ కు సంబంధించి ఒక వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే శృతిమించిన అందాల ప్రదర్శన అంటూ సోషల్ మీడియాలో ఆమెపై దారుణంగా ట్రోలింగ్స్ జరిగాయి.దీనితో ఆ సంఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని, ఇన్​స్టాగ్రామ్ ఖాతా తెరవడానికి కూడా భయపడ్డాను అని తెలిపింది.

ఈ సందర్భంగా పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.

Telugu Netizens, Payal Rajput, Kind Heart, Payal Raj Put, Reacts, Tollywood, Tro

ఆ వీడియోపై చాలా దారుణంగా కామెంట్ చేశారు.నాది సున్నిత మనస్తత్వం.ఇలాంటి వ్యతిరేక ప్రచారాలు నా కుటుంబం పై ప్రభావం చూపిస్తాయి.

సోషల్ మీడియాలో నాపై వస్తున్న ట్రోలింగ్స్ చూసిన నా పేరెంట్స్ అన్ని వదిలేసి ఇంటికి తిరిగి వచ్చేయ్ అని అన్నారు.ఈ ప్రచారాలు నా కెరిర్ ని ఏమి చేయవు అని వాళ్లకు నేను భరోసా కల్పించానని చెప్పుకొచ్చింది.

Telugu Netizens, Payal Rajput, Kind Heart, Payal Raj Put, Reacts, Tollywood, Tro

వినోద రంగంలో ఫొటోషూట్ సందర్భంగా వస్త్రధారణ పరమైన పొరపాట్లు సహజమని, వాటి గురించి అసహ్యంగా ప్రచారం చేయవద్దు అంటూ హితవు పలికింది.అలాగే తాను ఇన్​ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒరిజినల్ వీడియోలో ఎలాంటి అసభ్యత కనిపించలేదని, ఎవరో దాన్ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారని ఆమె తెలిపింది.వ్యక్తులు మరీ ఇంతలా దిగజారిపోతారని ఊహించలేదు అంటు పాయల్ ఆవేదన వ్యక్తం చేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube