కోటీశ్వరిలో కోటి గెలుచుకున్న దివ్యాంగురాలు  

Tn Woman With Speech Impairment Wins Rs 1 Crore -kollywood,radhika,tn Woman With Speech Impairment,wins Rs 1 Crore

హిందీలో అమితాబచ్చన్ చేసిన కౌన్ బనేగా కరోడ్ పతి స్ఫూర్తితో తెలుగులో నాగార్జున, చిరంజీవి వ్యాఖ్యతలుగా మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మూడు సీజన్ లు చేశారు.అయితే ఈ షోలో ఇప్పటి వరకు తెలుగులో ఎవరు కోటి రూపాయిల ప్రశ్నకి సమాధానం చెప్పి అంత పెద్ద మొత్తం సొమ్ము సొంతం చేసుకోలేదు.

TN Woman With Speech Impairment Wins Rs 1 Crore Jackpot-Kollywood Radhika Tn Jackpot

అయితే ఇదే షోని తమిళంలో రాధిక శరత్ కుమార్ వ్యాఖ్యతగా కోటీశ్వరి పేరుతో కలర్స్ చానల్ లో ప్రసారం చేస్తున్నారు.ఇప్పుడు ఈ షోలో పాల్గొన్న ఓ దివ్యాంగురాలు ఏకంగా కోటి రూపాయిలు గెలుచుకొని అందరికి షాక్ ఇచ్చింది.

కౌశల్య కార్తీక అనే ఈ అమ్మాయి కోటి రూపాయిల ప్రశ్నకి సమాధానం చెప్పడం ద్వారా విజేతగా నిలిచింది.

1984లో ప్రచురించిన ఏ నవలలో పులకేశి-2 రాజు తమ్ముడు నాగ నంది గురించిన ప్రస్తావన ఉంది అని వ్యాఖ్యతగా ఉన్న రాధిక ప్రశ్నించగా ఆమె సమాధానంగా నవల పేరు శివగామియిన్ శబతామ్ అని సమాధానం చెప్పి విజేతగా నిలిచారు.కోటీశ్వరి కార్యక్రమంలో తనకు అవకాశం కల్పించిన వారందరీకి కార్తీక కృతజ్ఞతలు తెలిపారు.తాను చదువుకున్న మూగ, చెవిటి విద్యార్థుల పాఠశాలకు వచ్చిన సొమ్ములో కొంత సాయం చేస్తానని, అలాగే మిగిలిన దానితో స్విట్జర్లాండ్ లేదా ఇటలీ వెళ్ళాలని ఉందని అమె చెప్పారు.

మొత్తానికి దివ్యాంగురాలు అయిన కోటి రూపాయిలు గెలుచుకోవడం ద్వారా ఇప్పుడు తమిళనాడులో కౌశల్య పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.ఆమెకి పలువురు సోషల్ మీడియా ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు.

.

తాజా వార్తలు

Tn Woman With Speech Impairment Wins Rs 1 Crore -kollywood,radhika,tn Woman With Speech Impairment,wins Rs 1 Crore Related....