రాజీనామాలు, సస్పెండ్ లు ...కోదండరాం పార్టీలో కుమ్ములాటలు

తెలంగాణ జనసమితి (టీజేఎస్) పార్టీలో కుమ్ములాటలు అప్పుడే మొదలయిపోయాయి.పోలింగ్ తేదీకి ఇంకా కొద్ధి రోజులు మాత్రమే ఉన్న ఈ కీలక సమయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, మరో నేత రాజీనామా చేశారు.

 Tjs Vice President Rachana Reddy Quits On Party-TeluguStop.com

అంతే కాదు కోదండరాం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కోదండరాం మహాకూటమితో అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆయన మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని రచనా రెడ్డి ఆరోపించారు.

మహాకూటమిలో సామాజిక న్యాయం జరగలేదని, కోదండరాంను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె అన్నారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూటమిలో టికెట్లు ఇచ్చారని, ఈ కుమ్మక్కులో కోదండరాం కూడా భాగస్వామిగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.అంతే కాదు కూటమిలో చాలామంది నేతలను బలిపశువులను చేశారని ఆమె మండిపడ్డారు.తెలంగాణ ప్రజలకు ఇంగితజ్ఞానం ఉందని, చంద్రబాబు ప్రచారాన్ని వారు తిరస్కరిస్తారని ఆమె నిప్పులుచెరిగారు.

అయితే ….వారిని టీజేఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ నేతలు ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube