ఏంటి ఈ నాన్చుడు ..? కాంగ్రెస్ పై టీజేఎస్ ఆగ్రహం  

Tjs Party Fire On Congress-

మహాకూటమిలో ఉన్న టీజేఎస్ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికలు సమీపిస్తున్నా ఇంకా సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి రాకపోవడంతో పాటు సీట్ల పంపకాలను త్వరగా తేల్చాలని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తుండటంతో టీజేఎస్ అసహనం వ్యక్తం చేస్తోంది. సోమవారం టీజేఎస్‌ కోర్ కమిటీ సమావేశమైంది. సీట్ల పంపకాలపై అంతర్గత చర్చ జరిగింది. కాంగ్రెస్ సీట్ల పంపకం తేల్చకపోతే 15 స్థానాల్లో టీజేఎస్ అభ్యర్థులను ప్రకటిస్తామని హెచ్చరికలు జారీ చేసింది.

Tjs Party Fire On Congress-

Tjs Party Fire On Congress

పొత్తులపై తాడోపేడో తేల్చాలని కోదండరాపై టీజేఎస్‌ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినా కాంగ్రెస్ లో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో కొద్దిరోజులు వేచి చూద్దామని అప్పటికీ సీట్ల పంపకం ఓ కొలిక్కిరాకపోతే 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిద్దామని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ కోర్ కమిటీలో స్పష్టం చేసినట్లు సమాచారం.