ఇంకా అనుమానాలు ఉన్నాయ్ ! ఆయన్ను మార్చాల్సిందే ... టీజేఎస్  

  • తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి …ఫలితాలు వెలువడి సరిగా నెల రోజులు దాటింది. అయితే… ఇప్పుడు ఆ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయంటూ… తెలంగాణ జనసమితి ( టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాదు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ మీద కూడా అనేక ఆరోపణలు చేశారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ విఫలమైందన్నారు.

  • Tjs Cheif Allegations On Telangana Ec Rajath Kumar-

    Tjs Cheif Allegations On Telangana Ec Rajath Kumar

  • ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టమని … దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి పై మాకు అనేక అనుమానాలు ఉన్నందున ఆయనను పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించవద్దని ఆయన కోరారు. ఇదే విషయంపై త్వరలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. .