క్రిష్ వైష్ణవ్ తేజ్ సినిమా టైటిల్ ఫిక్స్.. ఏంటో తెలుసా?

ఇటీవలే విడుదలైన ఉప్పెన సినిమా ఓ రేంజ్ లో భారీ బడ్జెట్ తో దూసుకుపోతుంది.మెగాస్టార్ చిరంజీవి అల్లుడు వైష్ణవ్ తేజ్ ఈ సినిమా ద్వారా తొలిసారిగా హీరోగా వెండితెరకు పరిచయం కాగా కృతి శెట్టి ను కూడా తొలిసారిగా పరిచయం చేశారు.

 Title Fixed For Krish And Vaishnav Movie-TeluguStop.com

ఇక ఈ సినిమా లో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన ఈ సినిమాతోనే తన దర్శకత్వంను పరిచయం చేశాడు.
ఇక ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ మరో సినిమా ను చేయనుండగా.అది క్రిష్ దర్శకత్వంలోనే తెరకెక్కనుంది.క్రిష్ జాగర్లమూడి పవన్ కళ్యాణ్ తో ఓ సినిమాను చేస్తున్న సమయంలో కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగులు వాయిదా పడగా.ఆ తర్వాత తిరిగి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాను తిరిగి మొదలు పెట్టడానికి కాస్త సమయం పట్టగా.ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ మేనల్లుడు వైష్ణవ తేజ్ తో ఓ సినిమాను తెరకెక్కించారు.

 Title Fixed For Krish And Vaishnav Movie-క్రిష్ వైష్ణవ్ తేజ్ సినిమా టైటిల్ ఫిక్స్.. ఏంటో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా తక్కువ రోజుల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించుకోగా కొన్ని సన్నివేశాలను పూర్తి చేశారు.ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉంది.ఈ సినిమాకు ‘జంగిల్ బుక్’ అనే పేరు నిర్ణయించుకోగా.త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయనున్నారు.ఇక ఈ సినిమాలో కథ వచ్చేసి కొండ మీద నివాసముంటున్న ఓ గ్రామ ప్రజలు అక్కడ వ్యవసాయం చేయడం, అడవిలోని జంతువుల పట్ల వాతావరణం పట్ల ఎదుర్కొనే పరిస్థితుల గురించి తెరకెక్కనుంది.

#Krish #UppenaVaishnav #Vaishnav Tej #Uppena #Jungle Book

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు