శభాష్ : కరోనా వైరస్ సోకి మృతి చెందిన అనాథ శవాలను మోసిన ఎమ్మెల్యే....

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఎంతగా కలకలం సృష్టిస్తుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి మృత దేహాలు కూడా అంత్యక్రియలకు నోచుకోక అంతే ఇబ్బందులకు గురవుతున్నాయి.

 Tirupati Ycp Mla Bhumana Karunakar Reddy Is Did Funeral To The Corona Dead Body-TeluguStop.com

మరి కొన్ని చోట్ల అయితే ఏకంగా కరోనా వైరస్ సోకి మరణించిన వారి మృతదేహాలను పెట్రోల్ పోసి దారుణంగా తగులబెట్టేస్తున్నారు.కూలి పనులు చేసుకోవడానికి వలస వెళ్ళిన వారు కరోనా వైరస్ సోకి మృత్యువాత పడితే వారిని తమ సొంత గ్రామాలకు తరలించేందుకు కనీస వసతులు లేక మరింత మంది తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

దీంతో తాజాగా తిరుపతి వైకాపా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కరోనా వైరస్ సోకి మృత్యువాత పడిన అనాధ శవాల పాడి మోసి సంప్రదాయ ప్రకారంగా అంత్య క్రియలు నిర్వహించాడు.దీంతో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసినటువంటి ఈ పనికి నెటిజన్లు అభినందిస్తున్నారు.

 Tirupati Ycp Mla Bhumana Karunakar Reddy Is Did Funeral To The Corona Dead Body-శభాష్ : కరోనా వైరస్ సోకి మృతి చెందిన అనాథ శవాలను మోసిన ఎమ్మెల్యే….-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా కరోనా వైరస్ సోకినప్పుడు తమ అనుకున్నవాళ్లే కనీసం సహాయం చేయడానికి ముందుకు రావడం లేదని అలాంటిది అసలు మరణించింది ఎవరో కూడా తెలియని వారికి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటు కోవడం చాలా గొప్ప విషయమని కొందరు పార్టీ కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ విషయంపై స్పందించిన భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో మరణించాల్సిందేనని అలాంటప్పుడు భూమ్మీద ఉన్నప్పుడే కూసింత మానవత్వం చాటితే ఆ భగవంతుడు కూడా మనల్ని చల్లగా చూస్తాడని తెలిపాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజుకి దాదాపుగా మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.దీంతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు.

అంతేకాకుండా పలు చోట్ల సంపూర్ణ లాక్ డౌన్ విధించారు.అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా వైరస్ సోకినటువంటి ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్య చికిత్సలు అందించాలని అలాగే వైద్య చికిత్సలకయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను  కూడా సురక్షితంగా ఉంచండి.– తెలుగు స్టాప్.కామ్ యాజమాన్యం

#FuneralTo #Andhra Pradesh #TirupatiYCP #Tirupati #YCP MLA

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు