అదంతా తప్పుడు ప్రచారం అంటున్న తిరుపతి వైసీపీ అభ్యర్థి..!!

తిరుపతి ఉప ఎన్నికలలో వైసీపీ గెలవటానికి అడ్డదారులు తొక్కుతున్నట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి.పోలింగ్ సరళిలో అవకతవకలు జరుగుతున్నాయని, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందని వారు ఓట్లు వేస్తున్నారని, దొంగ ఓట్లు పడుతున్నాయని విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయి.

 Tirupati Ycp Candidate Doctor Gurumurthy Says All This Is False Propaganda-TeluguStop.com

ఇలాంటి తరుణంలో తిరుపతి ఉప ఎన్నిక వైసిపి అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి .వస్తున్న వార్తలపై స్పందించారు.

వెంకటగిరిలో ఉపఎన్నిక పోలింగ్ సరళిని పరీక్షించడానికి వెళ్లిన ఆయన మాట్లాడుతూ…  వైసీపీ భారీగా దొంగ ఓట్లు వేయిస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారం.  తప్పుడు ప్రచారమని ఖండించారు.

 Tirupati Ycp Candidate Doctor Gurumurthy Says All This Is False Propaganda-అదంతా తప్పుడు ప్రచారం అంటున్న తిరుపతి వైసీపీ అభ్యర్థి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తిరుపతి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న నేపథ్యం లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.అంతకుముందే గురుమూర్తి మన్నసముద్రంలో కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

రాత్రి 7 గంటల వరకు ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది.దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు 50 శాతానికి పైగానే పోలింగ్ శాతం నమోదైనట్లు సమాచారం.

 

#Wrong Votes #TirupatiYcp #TirupatiBy #Tirupati #Dr Gurumurthy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు