ఎన్టీఆర్ ఫ్యాన్ ప్రాణాలు నిలబెట్టిన జనసేన నేతలు.. వైరల్ అవుతున్న వీడియో!

శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన జనార్ధన్ అనే యువకుడు జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అన్న విషయం తెలిసిందే.ఇతను ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు.

 Tirupati Janasena Party Leaders Supports Ntr Fan Video Goes Viral Tirupati, Pawa-TeluguStop.com

జనార్ధన్ కొద్ది రోజుల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.దీనితో అత‌న్ని రేణిగుంట ద‌గ్గ‌ర ఉన్న ప్రైవేట్‌ హాస్పిటల్లో చికిత్సకి చేర్పించారు.

బిల్ ఐదు ల‌క్ష‌లు అయ్యింద‌ని హాస్పిట‌ల్ వ‌ర్గాలు తెలియ‌జేశాయి.జనార్ధన్‌కి తండ్రి లేడు త‌ల్లి మాత్ర‌మే ఉంది.

పేద కుటుంబం కావ‌టంతో బంధువులు,మ‌రి కొంద‌రు డ‌బ్బుల కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌సాగారు.విష‌యం జ‌న‌సేన పార్టీ నేత‌ల‌కు తెలిసింది.

ఇక వెంట‌నే వారు స్పందించి హాస్పిట‌ల్ యాజ‌మాన్యంతో మాట్లాడి ఎలాంటి డ‌బ్బులు తీసుకోకుండా జ‌నార్ధ‌న్‌ను రుయా హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు.విష‌యాన్ని జనార్ధన్‌కు బంధువైన ప్రియా వర్మ అనే మ‌హిళ వీడియోలో వివ‌రిస్తూ జనార్ధ‌న్ కుటుంబానికి సాయంగా నిలిచిన జ‌నసేన నేత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియచేస్తూ వీడియో విడుద‌ల చేశారు.

ఆ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.ఆ వీడియోలో ఆమె జ‌నార్ధ‌న్ మాకు రిలేటివ్ అవుతారు.

జూన్ 22న బైక్‌పై వెళుతున్న ఆ అబ్బాయికి యాక్సిడెంట్ కార‌ణంగా త‌ల‌కు పెద్ద దెబ్బ త‌గిలిందట.

అయితే జనార్ధన్ కండీష‌న్ సీరియ‌స్ అని చెప్ప‌డంతో రేణిగుంట ద‌గ్గ‌ర అమ‌ర హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లారు.అక్కడ డాక్టర్స్ వారం పాటు ట్రీట్‌మెంట్ చేశారు.అబ్బాయి కోమాలోనే ఉన్నాడు.

ఎలాంటి రెస్పాన్స్ లేదు.దాంతో వాళ్లు ఇంటికి తీసుకెళ్లిపోవ‌చ్చు అని హాస్పిట‌ల్ వాళ్లు అన్నారు.

పేద కుటుంబం బిల్ క‌ట్ట‌లేని ప‌రిస్థితి రావడంతో వారు డ‌బ్బుల కోసం ప్ర‌య‌త్నించారట.మీకు ఎన్టీఆర్‌గారు అండ‌గా ఉన్నారు క‌దా అని కొంద‌రు అన్నారు.

అయితే నిజానికి ఎన్టీఆర్‌ గారు మాట్లాడారు కానీ ఎటువంటి ఆర్థిక సాయం చేయ‌లేదు.ఆ స‌మ‌యంలో నేను ముర‌ళీ మోహ‌న్ అనే నా స్నేహితుడిని క‌లిశాను.

ఆయ‌న కొంద‌రి జ‌న‌సేన నాయ‌కుల నెంబ‌ర్స్ ఇచ్చారు.నేను కాంటాక్ట్ అయ్యాను.

న‌ల్లా శ్రీనివాస్‌గారిని కాంటాక్ట్ అయ్యాను.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube