దొంగ ఓట్లు అంటూ వైకాపా పై మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి..!!

తిరుపతి ఉప ఎన్నికలలో అధికార పార్టీ వైసిపి మెజార్టీ సాధించటానికి అడ్డదారులు తొక్కుతున్నటు విపక్ష పార్టీల ఆరోపణలు చేస్తూ ఉన్నాయి.తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సంబంధం లేని నియోజకవర్గాల నుండి దొంగ ఓట్లు వేయించడానికి బస్సుల్లో తరలిస్తున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు.

 Tirupati Congress Candidate Serious Comments On Ysrcp Party-TeluguStop.com

ఇలాంటి తరుణంలో ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన చింతా మోహన్ కూడా సీరియస్ కామెంట్లు చేశారు.జగన్ కి రాష్ట్రంలో ఇమేజ్ పోయిందని ఆయన మండిపడ్డారు.

ఏదోవిధంగా గెలవాలన్న తపనతో దొంగ ఓట్లు వేయించుకుంటున్నారు అని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే రీతిలో వ్యవస్థలు కూడా దిగజారిపోయాయి అని చింతా మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

 Tirupati Congress Candidate Serious Comments On Ysrcp Party-దొంగ ఓట్లు అంటూ వైకాపా పై మండిపడ్డ కాంగ్రెస్ అభ్యర్థి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వెంటనే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రజాకోర్టుల దొంగ జగన్ దొరికిపోయాడు అని అన్నారు.వెంటనే గవర్నర్ ఈ విషయంలో కలుగజేసుకుని జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని తెలిపారు.అనంతపురం, కడప, పులివెందుల ఇంకా రాయలసీమలో కొన్ని ప్రాంతాల నుండి సంబంధం లేని జనాలు తిరుపతి ఉప ఎన్నికలలో ఓట్లు వేయడానికి వచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ ప్రముఖ మీడియా ఛానల్ ముందు చెప్పుకొచ్చారు.

#Tirupati #Chintha Mohan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు