శ్రీవారి హుండీకి కోటి రూపాయిలు !

అనుకోని అతిధిలా మన జీవితాల్లోకి వచ్చిన కరోనా అన్ని వ్యవస్థలను స్తంభింపజేసి అందరినీ ఇళ్లకు పరిమితం చేసింది.ఈ కరోనా పుణ్యాన ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది.

 Tirumula Tirupathi Hundi Collections Crossed 1crore-TeluguStop.com

దాన్ని సరిచేయడానికి ఒక పక్క ప్రభుత్వాలు ఆర్ధిక నిపుణులతో కూర్చొని పగలు, రాత్రి అని తేడా లేకుండా చర్చలు నిర్వహిస్తున్నారు.ఈ విపత్తును ఊహించని మనం సడన్ గా రావడంతో దెబ్బ తిన్నాం ఇప్పుడు ఆ దెబ్బలకు మందులు రాసే పనిలో బాగా బిజీగా ఉన్నాం.

మరి మనమే ఇన్ని ఇబ్బందులు పడుతుంటే మనల్ని నమ్ముకొని ఉన్న దైవ క్షేత్రాల పరిస్థితి ఏంటి?వాటిని నమ్ముకొని కొన్ని దశాబ్దాల నుండి జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు.

 Tirumula Tirupathi Hundi Collections Crossed 1crore-శ్రీవారి హుండీకి కోటి రూపాయిలు -Devotional-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక కరోనాతో సహా జీవనం తప్పదని ప్రభుత్వాలు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇన్నాళ్లు మూతపడిన ప్రముఖ దైవా క్షేత్రాలు ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతున్నాయి.

అలా లాక్‌డౌన్‌ అనంతరం శ్రీవారి ఆలయంలో తిరిగి దర్శనాలు ప్రారంభించారు.దర్శనాలు ప్రారంభించిన తరువాత తొలిసారి శ్రీవారి హుండీ ఆదాయం కోటి రెండు లక్షలు తేలింది.వేంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన శనివారం భక్తులు రికార్డు స్థాయిలో స్వామిని దర్శించుకున్నారు.భక్తులు స్వామి వారికి సమర్పించిన హుండీ కానుకలను టీటీడీ ఆదివారం లెక్కించింది.

కరోనాతో ప్రజలు సహజీవనం చేయడానికి అలవాటు పడుతున్నారు అందుకే ప్రముఖ పుణ్య క్షేత్రమైన తిరుమలకి మళ్లీ రద్దీ పెరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU