ప్రధాన అర్చకుల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం కీల‌క నిర్ణ‌యం.. !

ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.కాగా రిటైర్డ్ అర్చకుల విషయంలో టీటీడీ తీసుకున్న సంచలన నిర్ణయం తో ప్రధానా అర్చకుడి హోదాలో మళ్లీ రమణ దీక్షితులు విధులలో చేరారు.

 Tirumala Tirupati Temple Is The Key Decision In The Case Of The Chief Priests, T-TeluguStop.com

అంతే కాకుండా రమణ దీక్షితులు తో పాటుగా ఆలయంలో మరి కొంతమంది అర్చకులకు అవకాశం కలగనుంది.

ఈ నేపధ్యంలో నలుగురు ప్ర‌ధాన‌ అర్చకులను నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇకపోతే వంశపారం పర్య అర్చకులలోని నాలుగు కుటుంబాలకే ఈ అవకాశం కల్పిస్తున్న‌ట్లు వెల్లడించింది.వారిలో గొల్లపల్లి కుటుంబం నుంచి గోపినాథ్ దీక్షితులను, తిరుపతమ్మ నుంచి నారాయణ దీక్షితులను, పైడపల్లి నుంచి రాజేశ్ దీక్షితులను, అలాగే, పెద్దింటి నుంచి రవిచంద్ర దీక్షితులను నియమిస్తున్న‌ట్లు పేర్కొంది.

కాగా కైంకర్యపర అర్చకులకు ఈ అవకాశం లేదని వివ‌రించింది.ఇక అర్చకుల పదవీ విరమణ పై మే 16 2018 లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పతీసుకున్న నిర్ణయంతో రమణ దీక్షితుల తో పాటు పలువురు అర్చకులు ఉద్యోగాలను కోల్పోయిన విషయం తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube