తిరుమలలో దొంగతనం జరిగిన మాట వాస్తవమే

తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగిందట.అయితే ఇప్పుడు కాదు ఆరు నెలల క్రితమే ఈ దొంగతనం జరిగిందట.

 Tirumala Tirupathi Devastanam Ttd-TeluguStop.com

ఏకంగా ఏడు లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను ఆలయ అధికారి దొంగతనం చేసినట్లుగా విచారణ కమిటీ నిర్థారించింది.ఈ విషయాన్ని ఇన్నాళ్లకు మీడియా ముందుకు ఆలయ అధికారులు తీసుకు వచ్చారు.

ఆలయంలో విధులు నిర్వర్తించే శ్రీనివాసులు ఈ పని చేసినట్లుగా నిర్థారించారు.ఆరు నెలలుగా ఆయన జీతం నుండి 25 వేల చొప్పున కట్‌ చేస్తున్నట్లుగా కూడా వారు చెప్పారు.

అయిదు కేజీల వెండి కిరీటంతో పాటు బంగారు నాణెలు, నక్లెస్‌ మరియు ఇతర ఆభరణాలను ఆయన చోరీ చేసేందుకు సహకరించాడు అంటూ విచారణలో వెళ్లడి అయ్యింది.చోరికి పాల్పడ్డ ఆయన్ను విధుల నుండి ఎందుకు బహిష్కరించడం లేదు అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.

తిరుమల దేవస్థానం మొత్తం కూడా అవినీతి మయం అయ్యింది అనేందుకు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube