తిరుమల ఏడుకొండల ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా?

తిరుమల తిరుపతిలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు.ఇక్కడ ఈ దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.

 Tirumala Srivenkateshwara Seven Hills Story-TeluguStop.com

ఈ దేవాలయ దర్శనార్థం దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు.ప్రతిరోజు లక్షల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు.

వెంకటేశ్వర స్వామిని వడ్డీ కాసుల వాడు అని, కలియుగ దైవం అని, ఏడుకొండలవాడు అని పిలుస్తారు.

 Tirumala Srivenkateshwara Seven Hills Story-తిరుమల ఏడుకొండల ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఏడు కొండలు దాటి ఆపై ఆనంద నిలయంలో స్వామి వారు కొలువై ఉండడం వల్ల స్వామి వారిని ఏడుకొండలవాడు అని పిలుస్తారు.

అయితే మన పురాణాల ప్రకారం ఈ ఏడు కొండలకు ఒక్కొక్క కొండకు ఒక ప్రాధాన్యత కలిగి ఉంది.ఆ ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.

1) వృషభాద్రి:

తిరుపతి లో మొదటి కొండను వృషభాద్రి అనీ పిలుస్తారు.వృషభాసురుడు అనే రాక్షసుని పేరు మీద ఈ కొండకు ఈ పేరు వచ్చింది.

వృషభాసురుడు శివుని తో పోరాటం చేసి అతను చనిపోయే ముందు ఈ కొండకు తన పేరు పెట్టమని వరంగా కోరుతాడు.అందువల్ల ఈ మొదటి కొండను వృషభాద్రి అని పిలుస్తారు.

2) అంజనాద్రి:

అంజనీదేవి తన సంతానం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసి ఈ కొండపై తపస్సు చేయడం వల్ల వారికి హనుమంతుడు జన్మిస్తాడు. అంజనాద్రి ఈ కొండపై తపస్సు చేయడం వల్ల దీనికి అంజనాద్రి అని పేరు పెట్టారు.

3) నీలాద్రి:

నీలాద్రి విష్ణువు మూడవ భార్య,సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి తలపై దెబ్బ తగిలినప్పుడు తలలో కొంత భాగం బట్టతల గా మారుతుంది.అయితే దానివల్ల స్వామివారికి అందవిహీనంగా కనిపిస్తారని, నీలాదేవి తన వెంట్రుకల కత్తిరించి స్వామి వారికి ఇస్తుంది.అంతటి గొప్ప త్యాగం చేసిన ఆమె పేరు మీద ఆ కొండకు నీలాద్రి అనే పేరు వస్తుంది.

4) గరుడాద్రి:

గరుడ అంటే గ్రద్ద ఇది విష్ణుమూర్తి వాహనం గరుడు తన బంధువులను చంపి ఆ పాపం నుంచి విముక్తి కలగాలని విష్ణుదేవుని ప్రార్థిస్తాడు.ఆ విష్ణువు అతని కోరికను మన్నించి వైకుంఠానికి తిరిగి రావాలని కోరగా విష్ణువు తానే స్వయంగా వస్తానని చెప్పి అక్కడ ఆ కొండ రూపంలో ఉంటాడు.అందుకే ఈ కొండకు గరుడాద్రి అనే పేరు వచ్చింది.

5) శేషాద్రి:

ఏడుకొండలలో శేషాద్రి ఎంతో ప్రాముఖ్యత కలిగినది.విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కొలువై ఉండే ఆ పాము వల్ల ఈ కొండకు ఆది శేషాద్రి అనే పేరు వచ్చింది.

6) నారాయణాద్రి:

ఈ కొండపై నారాయణ మహర్షి విష్ణువు మూర్తి అనుగ్రహం కోసం ఈ కొండపై తపస్సు చేయడం వల్ల ఈ కొండను నారాయణాద్రి అని పిలుస్తారు.

7) వెంకటాద్రి:

ఈ కొండపై స్వామి వారు ఆనంద నిలయం అని గర్భగుడిలో కొలువై ఉండడం వల్ల ఈ కొండను శేషాద్రి అని పిలుస్తారు.

#Vrushabadri #Garudadri #Hindu Temple #Narayanadri #Tirumala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

LATEST NEWS - TELUGU