తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టోకెట్ల ఆన్ లైన్ కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.భక్తుల సౌకర్యార్థం సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆన్ లైన్ టోకెన్లు ఈనెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు అందుబాటులో ఉంటాయని టీటీడీ అధికారులు తెలిపారు.
సెప్టెంబర్ నెలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరిగే తేదీల్లో అంగప్రదక్షిణ టోకెన్లను రద్దు చేయనున్నట్లు వెల్లడించారు.