తిరుమలలో అకస్మాత్తుగా వరుణ దేవుడు నీటి బిందువుల జల్లులను కురిపించాడు.తిరుమలలో ఒక్కసారిగా కురిసిన వర్షానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు.
స్వామి వారి దర్శనంకు వెళ్ళే భక్తులు, స్వామి వారి దర్శనంతరం వెలుపలకు వచ్చే భక్తులు వసతి గృహాలకు వెళ్ళేందుకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వర్షం కారణంగా తిరుమల ఘట్ రోడ్డులో ప్రయాణించే ప్రయాణీకులను టిటిడి విజిలెన్స్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది.ఘట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడే అవకాశం ఉండడంతో భక్తులు అప్రమత్తంగా ప్రయాణించాలని విజిలెన్స్ సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.
తిరుమలలో స్వామి వారి దర్శనంతరం బయటకు వచ్చిన వృద్దులు, చంటి పిల్లల తల్లిదండ్రులు వసతి గృహాల వద్దకు చేరుకునేందుకు అవస్ధలు పడుతున్నారు.