టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీపికబురు అందించారు.నేటి నుంచి శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి ఇవ్వాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

 Tiruma-srivariwalk Way Opens From Today-TeluguStop.com

ఈ మేరకు టీటీడీ అధికారులు తాజాగా సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులకు అనుమతి మంజూరు చేస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు.

దర్శనం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి మెట్ల మార్గంలో అనుమతి ఇస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.దర్శనం టిక్కెట్లు కూడా వస్తే మెట్ల మార్గంలో అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

నడకదారిలో టీటీడీ విజిలెన్స్, ఫారెస్ట్ సిబ్బంది ప్రత్యేకంగాగస్తీ కాయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.కరోనా ప్రభావం కారణంగా భౌతికదూరం పాటించాల్సిన అవసరం ఉన్నందున నడక మార్గాన్ని టీటీడీ అధికారులు కొద్ది నెలల క్రితం మూసివేశారు.

అలాగే తిరుమలకు వెళ్లే రెండు ఘాట్ రోడ్ల కూడా మూసివేశారు.అయితే ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గిన క్రమంలో తిరిగి మెట్ల మార్గంలో భక్తులను అనుమతించాలని తాజాగా టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

టీటీడీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube