వైరల్.. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన గ్రామస్థులు.. దాంతో సొంతంగా..!

ప్రభుత్వం చేపట్టే పనులంటే ఏళ్లకేళ్లు పడతాయని అందరికి తెలిసినా విషయమే.అధికారుల నిర్లక్ష్యమే అందుకు ప్రధాన కారణం.

 Tired Of Administration Delay Odisha Villagers Construct Wooden Bridge On Their Own-TeluguStop.com

అనుకున్న సమయానికి కూడా కొన్ని పనులు పూర్తి కావు.కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయని ప్రజలు అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినా అధికారులు పట్టించుకోక పోవడం వల్ల ఆ సమయాలు సమస్యలుగానే మిగిలి పోతున్నాయి.

ఇలాంటి సమస్యే ఈ ఊరు ప్రజలకు కూడా ఎదురైంది.వాళ్ళు అందరు కలిసి అధికారులకు ఎన్నిసార్లు తమ సమస్యని విన్నవించుకున్నా వాళ్ళ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ గ్రామస్థులు విసిగి పోయారు.

 Tired Of Administration Delay Odisha Villagers Construct Wooden Bridge On Their Own-వైరల్.. ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన గ్రామస్థులు.. దాంతో సొంతంగా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎన్నిసార్లు విన్నవిన్చుకున్నా పట్టించుకోని అధికారుల అలసత్వానికి విసిగిపోయిన ప్రజలు ఇంకా ఓపిక లేక వాళ్ళ సమస్యను వాళ్లే పరిష్కరించు కోవాలని నిర్ణయించు కున్నారు.

అసలు ఇంతకీ ఆ గ్రామస్థులకు వచ్చిన సమస్య ఏమిటా అని అనుకుంటున్నారా.

వాళ్ళ గ్రామానికి అసలు సమస్య వర్షం.అవునండి మీరు విన్నది నిజమే ఆ ఊరు ప్రజలు వర్షంతో చాలా ఇబ్బంది పడుతున్నారు.

ఒడిశాకు చెందిన ఒక గ్రామంలో వర్షం కారణంగా కొన్ని దశాబ్దాలుగా ఇబ్బంది పడుతున్నారు.వాళ్ళ ఊరు చుట్టూ మూడు వాగులు ఉండడంతో చిన్న వర్షానికి కూడా వాళ్ళు ఆ ఊరు దాటి బయటకు వెళ్ళలేరు.

Telugu Administration Fail, Balangir District, Government Failure, Government Inaction, Kuturakenda Village, Odisha, Tired Of Administration Delay Odisha Villagers Construct Wooden Bridge On Their Own, Villagers, Wooden Bridge-Latest News - Telugu

ఈ సమస్యకు ఒక వంతెన నిర్మించాలని అధికారులకు ఆ గ్రామస్థులు ఎన్నో ఏళ్లుగా విన్నవించు కుంటున్న వాళ్ళు పట్టించు కోవడం లేదు.దాంతో వాళ్ళు విసిగి పోయి వాళ్ళ సొంత డబ్బులతో వంతెన నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు.అనుకున్న వెంటనే చెక్కల సహాయంతో ఒక వంతెన నిర్మించు కుంటున్నారు.ఇప్పటికే చాలా మేరకు పూర్తి చేసారు.త్వరలోనే వంతెనను ప్రారంభించ బోతున్నారు.ఆ గ్రామా ప్రజలు తీసుకున్న నిర్ణయానికి అందరు వారిని ప్రశంసిస్తున్నారు.

#TiredOf #Villagers #Odisha #Wooden Bridge

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు