మహారాష్ట్రాలో టిప్పు సుల్తాన్ అవుట్..?

Tipu Sultan Out In Maharashtra, MAHA VIKAS AGHADI, CM EKNATH SHINDE, MAHA SARKAR, TIPPU SULTHAN, MAHARASTRA TIPPU SULTHAN, EX CM UDDAV THAKREY,

మహారాష్ట్రాలో మహా వికాస్ అఘాడీ తీసుకున్న నిర్ణయాన్ని.తాజా ప్రభుత్వం అమలు చేసింది.

 Tipu Sultan Out In Maharashtra, Maha Vikas Aghadi, Cm Eknath Shinde, Maha Sarka-TeluguStop.com

ఏక నాథ్ షిండే నేతృత్వంలోని కూటమి.ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

కర్ణాటకలో కొనసాగుతున్న టిప్పు సుల్తాన్ వివాదానికి.మహారాష్ట్రలో చెక్ పెట్టింది.

మహారాష్ట్రాలో టిప్పు సుల్తాన్ పేరుమీద ఉన్న ఓ పార్క్ పేరును మార్చుతూ జీవో జారీ చేసింది.మాజీ మహారాష్ట్రా సీఎం ఉద్దవ్ థాక్రే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

అయితే అప్పటి కారణాల వల్ల ఈ జీవో ఇంప్లీమెంట్ కాలేదు.

Telugu Maha Sarkar, Maharastratippu, Tippu Sulthan-Politics

మహారాష్ట్రా కొత్త సారధిగా షిండే వచ్చిన దగ్గరి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ.పార్టీని గాడిలో పెడుతున్నారు.ఇక టిప్పు సుల్తాన్ పేరును తొలగిస్తూ.

మహా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని.అటు కర్ణాటక బీజేపీ నేతలతో పాటు మహారాష్ట్రా బీజేపీ నేతలు సైతం స్వాగతిస్తూ ఉన్నారు పలు హిందూ సంఘాలు కూడా మహా సర్కార్ నిర్ణయాన్ని స్వాగతించాయి.

ఇక ప్రజల నుంచి ప్రతిపక్షాల నుంచి భారీగా విమర్శలు, నిరసనలు రాకుండా.మహా సర్కార్ మరో మాస్టర్ ప్లాన్ వేసింది.

Telugu Maha Sarkar, Maharastratippu, Tippu Sulthan-Politics

టిప్పు సుల్తాన్ పేరకు బదులుగా ఆష్ఫాఖుల్లా ఖాన్ పేరును గానీ, బీఆర్ అంబేద్కర్ పేరును గానీ స్థానికులు సూచించాలని కోరారు.మెజారిటీ ప్రజలు అభిప్రాయాన్ని తాము స్వీకరిస్తామని ఓ బీజేపీ నేత ట్వీట్ చేశారు.మహా సర్కార్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించలేక పోతున్నాయి.బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రతిపక్షాల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అనేలా మారింది.

దాంతో టిప్పు సుల్తాన్ పేరును తీసేసినా.నోరు మెదపడం లేదు.

మహా సర్కార్ నిర్ణయం ఒక్క పార్కుకే వర్తించదని.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ టిప్పు సుల్తాన్ పేరు ఉందో.

అక్కడ కూడా వర్తిస్తుందనే గుసగుసలు మొదలు అయ్యాయి.ఇక విమర్శకులు సైతం మహా సర్కార్ నిర్ణయంతో టిప్పు సుల్తాన్ పేరు రాష్ట్రం నుంచి వెళ్లిపోతుంది అని చెబుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube