ఇది చదివిన తర్వాత వెంటనే నాటు కోడి తినాలనిపించడం ఖాయం.. ఒక సారి ట్రై చేయండి

మారిన పరిస్థితులు, పెరిగిన సాంకేతిక కారణాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.గతంలో ఒక మనిషిలో రోగ నిరోదక శక్తి చాలా ఎక్కువగా ఉండేది.

 Tipstelugu Country Chicken Human Health-TeluguStop.com

కాని ఇప్పుడు దాని శాతం చాలా తగ్గిందని చెప్పాలి.ఎందుకంటే తినే ఆహారం, పాటించే నియమ నిబంధనలు.

ముఖ్యంగా ఆహారం విషయంలో గతంతో పోల్చితే చాలా మార్పులు వచ్చాయి.ఒకప్పుడు కోడి కూర అంటే నాటు కోళ్లు అదే పెరటు కోళ్లు మాత్రమే.

కాని ఇప్పుడు అసలు పెరటి కోళ్లు కనిపించడం లేదు.ఎక్కడో ఒక చోట ఉన్నా వాటి రేట్లు చుక్కల్లో ఉంటున్నాయి.

వైధ్యులు పెద్దలు అంటున్న దాని ప్రకారం పెరటి కోళ్ల మాసం చాలా ఆరోగ్యకరం మరియు స్వచ్చం అంటున్నారు.కాని ప్రస్తుత పరిస్థితుల్లో రేటు తక్కువ అనే ఉద్దేశ్యంతో బాయిలర్‌ కోళ్ల మాసంను తింటూ ఉన్నారు జనాలు.

బాయిలర్‌ కోళ్లు పూర్తిగా మందులతోనే పెరుగుతాయి.కేవలం రెండు నెలల్లోనే అవి ఏకంగా రెండు కేజీలకు పైగా బరువు పెరుగుతున్నాయి అంటే వాటిని ఎలా పెంచుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అదే నాటు కోడి రెండు కేజీల బరువు పెరగాలంటే కనీసం మూడు నుండి నాలుగు నెలల సమయం పడుతుంది.చాలా స్వచ్చమైన వాతావరణంలో, ఎలాంటి మందులు లేకుండా నాటు కోడి పెరుగుతుంది.

అందుకే నాటు కోడి తినడం మంచిది

ఇంకా నాటు కోడి వల్ల ఉపయోగాలు ఇప్పుడు చూద్దాం.

ఇది చదివిన తర్వాత వెంటనే నాటు

నాటు కోడి కూరలో అత్యధిక పోషక విలువలు మరియు రోగ నిరోదక శక్తి కలిగి ఉంటుంది.పాస్పరస్‌ మరియు ఐరన్‌ వంటి దాతువులు నాటు కోడి కూరలో ఎక్కువగా ఉంటాయి.పెరటి కోడి కూర తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తొలగి పోతాయి.

జలుబు మరియు గొంతు సంబంధిత సమస్యలు ఉంటే నాటు కోడి పులుసు తాగడం వల్ల బాగవుతుందని పెద్దలు అంటున్నారు.బాయిలర్‌ కోడితో పోల్చితే కొలెస్ట్రాల్‌ శాతం నాటు కోడిలో చాలా తక్కువగా ఉంటుంది.

అందుకే నాటు కోడిని మించిన మంచి మాసం లేదని పల్లె జనాలు అంటారు.కాని ఆ నాటు కోళ్లు కనుమరుగయ్యే పరిస్థితి వస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube