స్లిమ్ గా తయారవడానికి సూపర్ టిప్స్  

Tips To Turn Slim -

లావుగా ఉన్నవారి కష్టాలు మామూలుగా ఉండవు.నలుగురు కామెంట్ చేస్తారని, సరిగా కలిసి తిరగలేరు, ఆత్మవిశ్వాసం కరువై సరిగా మాట్లాడలేరు.

ఇవి పక్కనపెడితే అధికబరువు వలన లేనిపోని ఆరోగ్య సమస్యలు.స్లీమ్ గా ఉండాలనుకుంటే కొన్ని సూపర్ టిప్స్ పాటించాల్సిందే.

Tips To Turn Slim-Telugu Health-Telugu Tollywood Photo Image

* పొద్దున్నే అల్పాహారంలో ప్రొటీన్లు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి.ఉదయాన్నే ప్రొటీన్లు శరీరంలోకి చేరితే, ఆకలి ఎక్కువగా వేయదు.అప్పుడు అతిగా తినే సమస్య ఉండదు.

* పొట్ట దగ్గర కొవ్వు తగ్గాలంటే సాల్యుబల్ ఫైబర్ అవసరం.

ఈ ఫైబర్ ఎక్కువగా బార్లీ, సీడ్స్, నట్స్, బఠాణీలు, కొన్నిరకాల పళ్ళు, కూరగాయల్లో దొరుకుతుంది.కాబట్టి ఇవి డైట్ లో చేర్చుకొవాలి.

* తియ్యటి వస్తువులకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.అలాగే జ్యూస్ కి బదులు, పండ్లని అలాగే తినేయటం మేలు.

* కాఫీని ఓ లిమిట్ లో తాగితే మంచిది.దానిలో దొరికే కెఫైన్ జీవక్రియలని పెంచుతుంది.

* భోజనానికి అరగంట ముందు నీళ్ళు తాగడం మరచిపోవద్దు.బరువు తగ్గడానికి అతి సునాయసనమైన చిట్కా ఇది.మూడు నెలరోజులపాటు ఇలా చేస్తే ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

* నిద్రలేమి సమస్య, అలాగే అతినిద్ర ఆధికబరువుకి కారణమవుతుంది.

కాబట్టి శరీరానికి అవసరమైన 7-8 గంటల నిద్ర ప్రతీరోజు శరీరానికి ఇవ్వాలి.

* ఇంతే కాదు, వ్యాయామం చేయడం తప్పనిసరి.

అలాగే ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి.ఆహారాన్ని మెల్లిగా తినటం నేర్చుకోవాలి.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు