లిప్స్ చుట్టు నలుపు.చాలా మందిని ఈ సమస్య తెగ ఇబ్బంది పెడుతుంది.
ముఖం ఎంత తెల్లగా, అందంగా ఉన్నా.పెదవుల చుట్టు నల్లగా ఉంటే మాత్రం అందహీనంగానే కనిపిస్తారు.
రకరకాల కారణాల వల్ల పెదవుల చుట్టు నలుపు ఏర్పడుతుంది.ఇక ఈ నలుపును తగ్గించుకునేందు బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతూ ఎంతో ఖర్చు పెడతారు.
కానీ, కొన్ని కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అయితే.చాలా సులభంగా పెదవులు చుట్టు ఏర్పడిన నలుపును నివారించుకోవచ్చు.
మరి ఆ చిట్కాలు ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
లిప్స్ చుట్టు నలుపును తగ్గించడంలో ఓట్స్ అద్భుతంగా సహాయపడతాయి.
ఓట్స్‌ను పౌడర్ చేసుకుని.అందులో కొద్దిగా పాలు, తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పెద్దాల చుట్టు అప్లై చేసి.స్క్రబ్ చేయాలి.
ఒక ఐదు నిమిషాలు స్క్రబ్ చేసిన అనంతరం కోల్డ్ వాటర్‌తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేస్తే క్రమంగా పెదవుల చుట్టు నలుపు పోతుంది.
అలాగే రెండొవది.ఒక బౌల్లో శెనగపిండి, చిటికెడు పసుపు మరియు టమాటా రసం వేసి బాగా కలుపుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని లిప్స్ చుట్టు అప్లై చేసి.ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనివ్వాలి.ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేయడం వల్ల త్వరగా లిప్స్ చుట్టు ఉన్న నలుపు తగ్గుముఖం పడుతుంది.
ఇక బంగాళదుంప కూడా లిప్స్ చుట్టు నలుపును తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.ముందుగా బంగాళదుంప నుంచి రసం తీసుకుని.ఒక బౌల్లో వేసుకోవాలి.ఆ తర్వాత అందులో కొద్దిగా నిమ్మ రసం యాడ్ చేసి.
పెదవుల చుట్టు అప్లై చేయాలి.బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేసినా పెదవులు చుట్టు ఉన్న నలుపు పోతుంది.