బొద్దుగా ఉండే పిల్లల తల్లిదండ్రులకు సూచనలు... చేతులు దాటితే చేసేది ఏమీ చేయలేరు  

Tips To Obesity Children\'s Parents-

చిన్నతనంలో పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా అనిపిస్తారు.చిన్న పిల్లలు సన్నగా ఉంటే ఆకర్షనీయంగా అనిపించరు.కాని చిన్నతనంలో బొద్దుగా ఉండే పిల్లలు జాగ్రత్తలు తీసుకోకుంటే పెద్దయ్యాక ఉబకాయంతో ఇబ్బందులు పడాల్సి వస్తుందట.ఈ విషయంను నేను చెబుతున్నది కాదు.ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని చెబుతున్నారు.చిన్నపిల్లలు లావుగా ఉండటం వల్ల అప్పటికప్పుడు సమస్యలు ఏమీ రావని, కాని పిల్లలు పెద్దయ్యాక ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Tips To Obesity Children\'s Parents--Tips To Obesity Children's Parents-

లావుగా ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయనే విషయం ఇప్పటికే పలు ప్రయోగాల్లో వెళ్లడయ్యింది.

Tips To Obesity Children\'s Parents--Tips To Obesity Children's Parents-

పిల్లల్లో అధిక బరువును మొదటి నుండే అదుపులో ఉంచడం వల్ల వారు పెద్ద వారు అయ్యాక ఉభకాయంకు గురి కాకుండా ఉంటారు.ఉబకాయం వచ్చిన పిల్లలు మానసిక ఆందోళనకు గురి అవ్వడంతో పాటు, కెరీర్‌పై దృష్టి పెట్టలేక పోతారు.

అందుకే చిన్న తనం నుండే వారి బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.పిల్లలు ఎక్కువ బరువు పెరుగుతున్నారనిపించిన సమయంలో వారితో చిన్నప్పటి నుండే వ్యాయామం అలవాటు చేయాలి.

అలా అని చిన్న పిల్లలతో కంటిన్యూగా వ్యాయామం చేయించడం కూడా మంచిది కాదు.

రోజులో విడుదల వారీగా పిల్లలతో 50 నుండి 60 నిమిషాల పాటు వ్యాయామం చేయించడం మంచిది.వ్యాయామం అంటే వెయిట్‌ లిఫ్టింగ్‌ అలాంటివి కాకుండా నడిపించడం, సైకిల్‌ తొక్కించండం, ఆటలు ఆడించడం వంటివి చేయాలి.

అలా చేయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా కూడా చాలా అభివృద్ది చెందుతారు అంటూ నిపుణులు చెబుతున్నారు.

పిల్లలు ముఖ్యంగా స్వీట్లు, చాక్లెట్లు తినడం వల్ల లావు అవుతున్నారు.అందుకే పిల్లలకు వాటిని దూరంగా ఉంచడం మంచింది.ఇదే సమయంలో పిల్లలకు ఐస్‌ క్రీమ్‌లు కూడా దూరంగా ఉంచాలి.పిల్లలకు ఒంటరిగా కాకుండా అందరు కలిసి తినే సమయంలోనే ఆహారం పెట్టాలి.మొత్తంగా పిల్లల బరువు విషయంలో చిన్నప్పటి నుండే జాగ్రత్తగా ఉండటం వల్ల వారు పెద్దయ్యాక ఇబ్బంది పడకుండా ఉంటారు.