ఫోన్లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువైతే ఏం చేయాలి?   Tips To Increase Your Mobile Internet Speed     2018-03-25   06:59:31  IST  Raghu V

మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్స్ తగ్గడం, పెరగటం చాలా కామన్. కాని ఒక్కోసారి సిగ్నల్ బాగా ఉన్న ఆశించనంత స్పీడ్ రాదు. కొన్నిసార్లు బ్రౌజింగ్ కూడా సరిగా చేయలేకుండా ఉంటుంది పరిస్థితి. అప్పుడు నింద వేయాల్సింది కేవలం నెట్వర్క్ మీదే కాదు, మనం ఫోన్ ని ఉపయోగించే తీరుపై కూడా. మన చేసే చిన్ని చిన్ని తప్పుల వలన కూడా మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే …

* అవసరం లేని యాప్స్ ని మొబైల్ లోనే ఉంచకూడదు. ఎక్కువ యాప్స్ ఉంటే డేటా షేరింగ్ కూడా ఎక్కువే ఉంటుంది. అన్ని యాప్స్ ఒకేసారి నెట్ ని ఉపయోగించుకోవడం వలన మన అవసరము సరిగా తీరదు.

* యాక్సెస్ పాయింట్ సెట్టింగ్స్ లో మార్పులు చేయడం వలన కూడా ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవచ్చు. మీ నెట్వర్క్ ని బట్టి, స్పీడ్ గా పనిచేసే యాక్సెస్ పాయింట్స్ ని తెలుసుకోండి.

* మంచి మొబైల్ బ్రౌజర్ ని వాడాలి. చాలామంది నిపుణులు అభిప్రాయం ప్రకారం యూసి బ్రౌజర్, ఒపెరా మిని బాగా ఫాస్ట్ గా పనిచేస్తాయి.

* క్యాచీ ఫైల్స్ ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉండాలి. ఈ అన్వాంటెడ్ ఫైల్స్ డేటాని తినేస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని క్లీన్ చేస్తూ ఉండటం అవసరం.

* RAM ఎక్కువ ఉంది కదా అని మల్టిటాస్కింగ్ మరీ ఎక్కువగా చేయొద్దు. అవసరం తీరాక యాప్స్ ని మినిమైజ్ కాకుండా క్లోజ్ చేయడం అలవాటు చేసుకోండి. అప్పుడే స్పీడ్ బాగుంటుంది.

* Faster Internet 2X, Internet Speedbooster, Internet Speed Master లాంటి యాప్స్ స్టోర్ లో ఉంటాయి. స్పీడ్ ని పెంచటానికి వీటిని ఓసారి ప్రయత్నించి చూడండి.

* LTE, 3G మోడ్స్ ని ఆన్ లో పెట్టండి.