నిద్రలేమి సమస్యా? ఇవిగో చిట్కాలు

రాత్రి 12 అవుతుంది, నిద్రేమో పట్టదు.పోని 7-8 గంటల నిద్ర కవర్ చేసేలా ఆలస్యంగా లేద్దామా అంటే కుదరదు.

 Tips To Get Rid Of Insomnia-TeluguStop.com

పొద్దున్నే లేచి ఆఫీసుకో, కాలేజికో వెళ్ళాల్సిందే.నిద్ర పట్టదు, కనుల కింద వలయాలు, డిప్రెషన్, ఆరోగ్య సమస్యలు .ఒకటి రెండేంటి .నిద్రలేమి వలన రాని సమస్యే లేదు.మరి ఈ నిద్రలేమి ఎలా దూరం చేసుకోవాలి? సుఖమైన, నిండైన నిద్ర ఎలా పొందాలి ? ఇవిగో చిట్కాలు.

* పడుకునే ముందు స్నానం చేసుకోవడం అలవాటు చేసుకోండి.

రోజంతా పడ్డ టెన్షన్, స్ట్రెస్ అంతా ఒక్క దెబ్బతో వెళ్ళిపోయి నిద్రపడుతుంది.

* లైట్ మ్యూజిక్ వినండి.

మీకిష్టమైన సంగీతం.రాక్ మ్యూజిక్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

మెలోడి మాయలో, అలా అలా నిద్రలోకి జారుకుంటారు.

* బెడ్ రూమ్ లో టీవీ , కంప్యూటర్ లాంటివి పెట్టుకోవద్దు.

మన నిద్రను చెడగొట్టేవే అవి.

* 20 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ మీ గదిలో ఉంటే, నిద్ర కష్టంగానే పడుతుంది.ఏసి వాడతారో, ఫ్యాన్ తో సరిపెడతారో, లేక మీ రూమ్ లో వేడి లేకుండా ఏవైనా జాగ్రత్తలు తీసుకుంటారో మీ ఇష్టం.

* రోజంతా ఏం జరిగింది అనే అలోచనలు నెమరు వేయడం మానెయ్యండి.

* వదులుగా ఉండే బట్టలు తొడుక్కోని నిద్రపోవాలి.అసలు బట్టలే లేకుండా పడుకుంటే ఇంకా మంచిది.

ఏదైనా మీ వీలునుబట్టి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube