మీ ఫోన్ మొత్తం వాట్సాప్ ఫోటోలు, వీడియోలతో నిండి పోయిందా..? అయితే ఇలా ఫాలో అవ్వండి..!

ప్రస్తుతం అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నారు.ఆరు సంవత్సరల పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు స్మార్ట్ ఫోన్ ను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు.

 Tips To Remove Whatsapp Memory And Save Data Usage, Whatsapp, Photos And Videos,-TeluguStop.com

అయితే ఈ స్మార్ట్ ఫోన్ లో ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే.ఒక వాట్సాప్ నెంబర్ కి వారి కుటుంబ సభ్యుల నుంచి, వారి పని చేస్తున్నా కంపెనీ నుండి, అలాగే వారి స్నేహితుల నుండి, ఇలా ఎన్నో రకాలుగా కొన్ని గ్రూప్స్ ఉండడంతో అందులో వచ్చే మెసేజ్లు, ఫోటోలు, వీడియోలు ఇలా అనేక రకాల విషయాలపై వచ్చే వాటితో మీ ఫోన్ మొత్తం నిండిపోతుంది.

అయితే ఈ సమస్య ఒక్కరిది మాత్రమే కాదు వాట్సాప్ ఉపయోగిస్తున్నవారు అందరిదీ.అయితే ఇలా కేవలం వాట్సాప్ ద్వారా మాత్రమే స్టోరేజ్ ఫుల్ అయ్యేవారికి కొన్ని పద్ధతులు వాడితే ఆ సమస్య నుంచి ఇట్లే బయటపడవచ్చు.

అవేంటో ఒకసారి చూద్దామా…
వాట్సాప్ లో మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే మెమొరీ సమస్యను వీలైనంత వరకు తగ్గించవచ్చు.అయితే ఇందుకోసం మొదటగా ఆటో డౌన్లోడ్స్ నిలిపివేయాలి.

అంతేకాకుండా బ్యాకప్ ని మెయింటైన్ చేయడం లాంటివి టిప్స్ తో స్టోరేజ్ ను చాలా వరకు కాళీ చేసుకోవచ్చు.ఇందుకోసం మీ వాట్సాప్ లో కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది.

ఇందుకుగాను వాట్సప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లో ఉన్న మీడియాలోని ఆటో డౌన్లోడ్ సెక్షన్ క్లిక్ చేస్తే.అందులో మీకు మరో మూడు ఆప్షన్లు కనపడతాయి.

అందులో మొబైల్ డేటా, వైఫై కనెక్ట్ చేసినప్పుడు, చివరిది రోమింగ్ అని కనబడుతుంది.ఇలా ప్రతి ఒక్క దాంట్లో ఆడియోస్, ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ బాక్స్ ఆన్ చెక్ చేసుకోండి.

ఆ తర్వాత సింపుల్ గా ఓకే బటన్ చేయండి.ఇక అంతే మీ స్మార్ట్ ఫోన్ లోని మెమొరీని చాలావరకు కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

Telugu Memory Usage, Tipsremove, Whatsapp, Whatsapp Tips-Latest News - Telugu

ఇక ఆ తర్వాత వాట్సాప్ ద్వారా డేటాను తక్కువగా ఉపయోగించుకునేందుకు మాత్రం కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.ఇందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి డేటా అండ్ స్టోరేజ్ పైన క్లిక్ చేయగా అక్కడ కాల్ సెట్టింగ్స్ లో డేటా యూసేజ్ అనే ఆప్షన్ ను ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీరు కాల్ మాట్లాడుతున్న సమయంలో చాలా తక్కువ డేటాను ఉపయోగించుకోవచ్చు.ఆ తర్వాత డేటా అండ్ స్టోరేజ్ పైన క్లిక్ చేస్తే స్టోరేజ్ యూసేజ్ అనే ఆప్షన్ కనబడుతుంది.దానిని క్లిక్ చేయడం ద్వారా ఏ చాటింగ్ వల్ల ఫోన్ లో స్టోరేజ్ ఫుల్ అవుతుందో ఇట్టే తెలిసిపోతుంది.

దాంతో మీరు ఎక్కువగా ఏ వాట్సాప్ గ్రూప్ లో వచ్చే ఫైల్స్ వల్ల మీ ఫోన్ నుండి పోతుందో ఇట్లే గుర్తుపట్టవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube