పెదాలు పగలకుండా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించాల్సిందే...!

ఆడవారికి ముఖ్యంగా వారి అందంలో పెదాలు ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తాయి.మామూలుగా వాతావరణంలోని వచ్చే వేడి లేదా చల్లదనం వలన ముందుగా మన శరీరం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

 Tips For Lips Dryness,lips, Olive Oil, Weather, Dehydration, Health, Beautiful L-TeluguStop.com

ఇందులో భాగంగానే పెదాలపై అనేక మార్పులు సంభవిస్తాయి.ఒకవైపు ఎండ ఎక్కువగా ఉన్నా సరే, మరోవైపు చలి ఎక్కువగా ఉన్నా సరే పెదాలలో మార్పులు ఖచ్చితంగా సంభవిస్తాయి.

పెదాలు పగిలితే అది చూడడానికి అందవిహీనంగా కనపడతాయి.వీటితో పాటు మనకి అనేక అనారోగ్య సమస్యలు తీసుకువస్తాయి.

కాబట్టి పెదాలు ఎక్కువగా పగలకుండా ఉండడానికి ఎలాంటి సూచనలు పాటించాలో ఒకసారి చూద్దామా….

మీరు ఇంట్లో ఉన్న వారైనా సరే… బయటికి వెళ్లే  వారైనా సరే… పెదాలపై లిప్ బామ్ ను రాసుకోవడం ద్వారా అవి వేడికి ప్రభావితం కాకుండా ఉంటాయి.

నిజానికి పెదాలు పగిలితే అందుకు ప్రధాన కారణం మన శరీరంలోని డీహైడ్రేషన్ లెవెల్.మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు రోజు ఒక లీటర్ పైన ఖచ్చితంగా నీరు తాగడం చాలా అవసరం.

అలాగే ఆడవారు లిప్ స్టిక్ వేసుకునే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.ఎక్కువ సమయం లిప్ స్టిక్ కూడా ఉపయోగించడం అంత శ్రేయస్కరం కాదు.

ఇక పెదాలు పగలడానికి మరో కారణం మనం తీసుకునే ఆహారం.మనం తీసుకునే ఆహారంలో యాసిడ్ సంబంధించి పదార్థాలు ఉండటం  వలన మన పెదాలు పగలడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది.

వీటినుంచి బయటపడేందుకు విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ వంటి వాటిని తీసుకోవడం ద్వారా పెదవులకు పగుళ్లు రాకుండా చూసుకోవచ్చు.ఇక అలాగే రాత్రి పడుకునే ముందు మన పెదవులపై ఆలివ్ ఆయిల్ రాసుకోవడం ద్వారా పగుళ్ళకు చికిత్స చేసినట్లు ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube